భారత జట్టుకు బిగ్ షాక్.. కీలక ప్లేయర్ ఔట్
ABN , Publish Date - Aug 02 , 2026 | 02:53 PM
శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఎడమ మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌కు దూరమైనట్లు తెలుస్తోంది.
స్పోర్ట్స్ డెస్క్: మరికొన్ని రోజుల్లో శ్రీలంకతో భారత్ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ గెలవాలనే పట్టుదలతో టీమిండియా ముమ్మర సాధన చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌కు దూరమైనట్లు తెలుస్తోంది. ఎడమ మోకాలి గాయంతో బాధపడుతున్న బుమ్రా.. పూర్తిగా కోలుకోకకపోవడంతో ఈ సిరీస్ నుంచి వైదొలిగాడని టాక్. తొలుత బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించాడని ప్రచారం జరిగినప్పటికీ.. అది నిజం కాదని సమాచారం.
జస్ప్రీత్ బుమ్రా ఇటీవల బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కు చేరుకున్నాడు. అక్కడ నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో మోకాలి గాయం పూర్తి స్థాయిలో నయం కానట్లు వైద్యులు గుర్తించినట్లు సమాచారం. గాయం పూర్తిగా తగ్గకముందే బుమ్రాను బరిలోకి దింపితే సమస్య మళ్లీ తిరగబడి.. పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉందని బీసీసీఐ భావిస్తోంది. అందుకే అతడిని తొందరపెట్టకుండా విశ్రాంతి, పునరావాసానికి మరింత సమయం ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
'గతంలో ఆటగాళ్లను తొందరపాటుతో క్రికెట్‌లోకి తిరిగి తీసుకురావడం వల్ల వారు తిరిగి గాయపడిన సందర్భాలు ఉన్నాయి. ఆ రిస్క్ తీసుకోలేం. ముఖ్యంగా బుమ్రా విషయంలో. కాబట్టి పూర్తిగా కోలుకోవడమే ఏకైక లక్ష్యం. ఈ ఏడాదిలో ఇంకా చాలా కీలక మ్యాచులు ఉన్నాయి. ఆసియా క్రీడలు, న్యూజిలాండ్ పర్యటన, వచ్చే ఏడాది ప్రారంభంలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ కూడా ఉన్నాయి' అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఇక శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు బుమ్రా స్థానంలో ఎవరిని జట్టులోకి తీసుకుంటారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. బీసీసీఐ కూడా ఇప్పటివరకు బుమ్రా గైర్హాజరీపై అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు. శ్రీలంకతో తొలి టెస్టు ఈనెల 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బుమ్రా జట్టులో లేకపోవడం భారత పేస్ బౌలింగ్ విభాగానికి పెద్ద ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
తైపీ ఓపెన్: చరిత్ర సృష్టించిన తన్వి శర్మ.. 18 ఏళ్ల తర్వాత భారత్‌కు టైటి
హార్దిక్ పాండ్య ట్రేడ్‌లో ట్విస్ట్.. సీఎస్కేతో చర్చలే లేవన్న ముంబై ఇండియన్స్