జులైలో రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు..
ABN , Publish Date - Aug 02 , 2026 | 02:54 PM
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి జులై నెలలో భక్తులు రికార్డు స్థాయిలో తరలివచ్చారు. గత నెలలో మొత్తం 24.52 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి జులై నెలలో భక్తులు రికార్డు స్థాయిలో తరలివచ్చారు. గత నెలలో మొత్తం 24.52 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. జులై నెలలో హుండీ ద్వారా రూ.140.29 కోట్ల ఆదాయం స్వామివారికి సమకూరింది. ఏకంగా ఐదు రోజుల పాటు హుండీ ఆదాయం రూ.5 కోట్ల మార్కును అధిగమించడం విశేషం. ఇందులో జులై 16న అత్యధికంగా రూ.5.31 కోట్లను భక్తులు హుండీలో సమర్పించారు.
అదేవిధంగా శ్రీవారికి మొక్కులు చెల్లించుకునే క్రమంలో 10.58 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. సెలవులు, శుభముహూర్తాలు, వారాంతాలు కలిసొచ్చిన నేపథ్యంలో జులై నెలంతా తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల సంఖ్య పెరిగినప్పటికీ దర్శనం, వసతి, అన్నప్రసాదం, లడ్డూ పంపిణీ తదితర సేవలను సమర్థవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. శ్రీవారి దర్శనానికి దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కేంద్ర పన్నుల వాటాతో ఏపీ అభివృద్ధి మరింత వేగవంతం: సీఎం చంద్రబాబు
పొగాకు రైతులకు భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు