Share News

మా సత్తా చూపిస్తాం.. టీమిండియాతో మ్యాచ్‌పై జపాన్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 11 , 2026 | 07:12 PM

జపాన్‌ క్రికెట్ అభిమానులకు గుర్తుండిపోయే రోజు సెప్టెంబర్ 22. ఆ రోజు భారత క్రికెట్ జట్టుతో జపాన్ మొట్టమొదటి టీ20 మ్యాచ్‌ను ఆడనుంది.

మా సత్తా చూపిస్తాం.. టీమిండియాతో మ్యాచ్‌పై జపాన్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు

స్పోర్ట్స్ డెస్క్: మరికొన్ని రోజుల్లో జపాన్ వేదికగా ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 22వ తేదీ జపాన్ క్రికెట్ అభిమానులకు మర్చిపోలేనే రోజుగా ఉండబోతుంది. కారణం.. భారత్ జట్టుతో జపాన్ తొలిసారి టీ20 మ్యాచ్ ఆడనుంది. జపాన్‌లో క్రికెట్‌ విస్తరణతో పాటు.. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల 75వ వార్షికోత్సవాలకు గుర్తుగా ఈ మ్యాచ్‌ నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఇప్పటికే టికెట్లన్నీ సేల్ అయిపోయినట్లు జపాన్ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది.


ఈ నేపథ్యంలో తాజాగా ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జపాన్ కెప్టెన్ కెండెల్ కడోవాకి ఫ్లెమింగ్‌(Japan Captain) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ లో తమ సత్తా చూపిస్తామని తెలిపాడు. 'భారత్ తో జరిగే మ్యాచ్ కోసం మేం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఈ మ్యాచ్ జపాన్ లో పెద్ద ఎత్తున క్రికెట్ అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నా. రెండేళ్ల క్రితం వరకు అఫ్గానిస్థాన్, నేపాల్‌ వంటి జట్లతో మ్యాచులను నిర్వహించడమూ కష్టమని భావించేవాళ్లం. కానీ, ప్రస్తుతం పరిస్థితులు మారాయి' అని ఫ్లెమింగ్ వెల్లడించాడు.


'ఆసియా క్రీడల్లో భాగంగా భారత్ వంటి అగ్రస్థాయి జట్టుకు ఆతిథ్యం ఇవ్వబోతున్నాం. కేవలం ఆ సందర్భాన్ని ఆస్వాదించడానికి, సంబంరం చేసుకోవాడనికి మాత్రమే కాదు.. ఓ జట్టుగా మా సత్తా ఏంటో నిరూపించుకోవడమే మా ముందున్న లక్ష్యం. అన్ని విభాగాల్లోనూ భారత్‌ అత్యుత్తమమైన జట్టు. ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో ప్రత్యక్షంగా ఆడటం గొప్ప అనుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐసీసీ పూర్తి సభ్య దేశాలతో పోటీపడటమనేది సుదీర్ఘ చరిత్రలో తొలి అడుగు అవుతుందని ఆశిస్తున్నా’ అని కెండెల్ తెలిపాడు.


ఈ వార్తలు కూడా చదవండి

ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.620 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం..

2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Updated Date - Sep 11 , 2026 | 08:10 PM