మోదీ-పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక అంశాల్లో పురోగతిపై సమీక్ష
ABN , Publish Date - Sep 11 , 2026 | 06:43 PM
న్యూఢిల్లీలో భారత అధ్యక్షతన 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో నేడు సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూఢిల్లీలో భారత అధ్యక్షతన 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో నేడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజకీయం, ఆర్థికం, రక్షణ, ఇంధనం, అంతరిక్షం, స్కిల్ మొబిలిటీ, ప్రజా సంబంధాలు తదితర రంగాలలో ఇరు దేశాల మధ్య జరుగుతున్న పురోగతిని ఇద్దరు నేతలు సమీక్షించారు. 2026లో భారత్ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్‌తో సహా పలు అంతర్జాతీయ, బహుళపక్ష వేదికల్లో భారత్-రష్యాల భాగస్వామ్యంపై అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ సమావేశంలో పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఘర్షణల వల్ల సముద్ర వర్తకం, భారతీయ నావికుల (Seafarers) భద్రతపై పడుతున్న ప్రభావంపై కూడా చర్చించారు. వివాదాల పరిష్కారానికి దౌత్యం, చర్చలే సరైన మార్గమని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. శాంతి స్థాపన ప్రయత్నాలకు సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ బలంగా నిలిచిన భారత్-రష్యాల ‘ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని’ మరింత బలోపేతం చేయడానికి నిరంతరం అందుబాటులో ఉండాలని ఇరు నేతలు అంగీకరించారు.
ఈ వార్తలనూ చదవండి:
పుతిన్‌కు మోదీ అందించిన విశిష్ట బహుమతి.. 'తిరుక్కురళ్'
ఉగ్రవాదంపై నిరంతరం పోరాడుతున్నాం: ప్రధాని మోదీ