Share News

ఉగ్రవాదంపై నిరంతరం పోరాడుతున్నాం: ప్రధాని మోదీ

ABN , Publish Date - Sep 11 , 2026 | 04:01 PM

అమెరికాలో 9/11 దాడులు జరిగి 25 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ఉగ్రబాధితుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. నాటి దాడి తరువాత బాధితుల జీవితాలు శాశ్వతంగా మారిపోయాయని అన్నారు.

ఉగ్రవాదంపై నిరంతరం పోరాడుతున్నాం: ప్రధాని మోదీ
PM Modi

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో 9/11 దాడులు జరిగి 25 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ఉగ్రబాధితుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. నాటి దాడి తరువాత బాధితుల జీవితాలు శాశ్వతంగా మారిపోయాయని అన్నారు. ఉగ్రవాదంపై పోరుకు భారత్ కట్టుబడి ఉందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక అమాయకులను ఉగ్రవాదం బలితీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంతర ఉగ్రవాదానికి భారత్ కూడా బాధిత దేశమని అన్నారు. ఉగ్రవాదంతో భారత్ దశాబ్దాలుగా పోరాడుతోందని చెప్పారు.


ఉగ్రవాదం కూడా కొత్త రూపాలను సంతరించుకుంటోందని ప్రధాని మోదీ తెలిపారు. భారత్ మాత్రం చెదరని పట్టుదలతో ఈ పోరులో ముందుకు సాగుతోందని చెప్పారు. ఈ పీడ వదిలించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పారు. 2014 నాటి 9/11 స్మారకం సందర్శనకు సంబంధించి ఫొటోలను కూడా ప్రధాని ఎక్స్ వేదికగా షేర్ చేశారు.

2001 సెప్టెంబర్‌ 11న అల్ ఖైదా ఉగ్రవాదులు అమెరికాపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. రెండు విమానాలతో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను కూల్చేశారు. పెంటగాన్‌‌పై కూడా ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడుల్లో 2,977 మంది మరణించారు. ఈ దారుణం జరిగి 25 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో అమెరికా వ్యాప్తంగా సంస్మరణ కార్యక్రమాలు జరిగాయి.


ఈ వార్తలనూ చదవండి:

బ్రిక్స్ సదస్సు.. పుతిన్, షీ జిన్‌పింగ్ బస చేసే హోటళ్లలో రోజుకు అద్దె ఎన్ని లక్షలంటే..?

బ్రిక్స్ సమ్మిట్: చిదంబరంనకు సొంత పార్టీ నేతల నుంచే కౌంటర్

Updated Date - Sep 11 , 2026 | 04:10 PM