ఐపీఎల్-2026 షెడ్యూల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..
ABN , Publish Date - Mar 10 , 2026 | 04:41 PM
గత కొన్ని రోజులుగా ఊరిస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ కు సంబంధించిన షెడ్యూల్ విడుదల తేదీ వచ్చేసింది. మార్చి 12న లీగ్ తొలి 20 రోజుల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధికారికంగా ప్రకటించారు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ క్రికెట్ అభిమానులకు అదిరిపోయే వార్త వచ్చేసింది. గతకొన్ని రోజులుగా ఊరిస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ కు సంబంధించిన షెడ్యూల్ విడుదల తేదీ వచ్చేసింది. మార్చి 12న లీగ్ తొలి 20 రోజుల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధికారికంగా ప్రకటించారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పూర్తి షెడ్యూల్ ప్రకటించడంలో ఆలస్యం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మిగతా షెడ్యూల్‌ను ప్రకటిస్తామని దేవజిత్ సైకియా వెల్లడించారు. కాగా, ఐపీఎల్ 2026 సీజన్ తొలుత మార్చి 26న ప్రారంభమవుతుందని ప్రకటించినా తర్వాత 28వ తేదీకి మార్చిన సంగతి తెలిసిందే. మే 31న జరిగే ఫైనల్‌తో ఈ సీజన్ ముగియనుంది. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో బెంగాల్, తమిళనాడుకు ఐపీఎల్ టీమ్స్ ఉండటం, అక్కడ హోమ్ గ్రౌండ్ మ్యాచులు జరగాల్సి ఉండటంతో భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా బీసీసీఐ జాగ్రత్త పడుతోంది. ఎన్నికల తేదీలకు అనుగుణంగా మ్యాచులను సర్దుబాటు చేయాల్సి రావడంతో షెడ్యూల్‌ను విడతల వారీగా ప్రకటిస్తున్నారు.
సాంప్రదాయం ప్రకారం గత సీజన్ విజేతలు, రన్నరప్ జట్లు సీజన్ తొలి మ్యాచ్ ఆడతాయి. ఈ విధంగా చూసినట్లు అయితే తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగే అవకాశం ఉంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఓపెనింగ్ మ్యాచ్ జరుగుతుందని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన పోస్టర్‌లో ఐపీఎల్ ట్రోఫీ చుట్టూ పసుపు, గులాబీ రంగు రిబ్బన్లు ఉండటంతో సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి:
నాన్నా.. మీ కల నిజం చేయడానికే మైదానంలోకి దిగాను: రింకు సింగ్ ఎమోషనల్ పోస్ట్
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ మిస్సింగ్.. కారణం ఇదేనా?