Share News

ఐపీఎల్ 2026: ఢిల్లీతో మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌కి భారీ షాక్

ABN , Publish Date - Apr 04 , 2026 | 04:00 PM

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో ముంబై జట్టుకు బిగ్ షాక్ తగిలింది.

ఐపీఎల్ 2026: ఢిల్లీతో మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌కి  భారీ షాక్
Hardik Pandya injury

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై జట్టు మొదటి బ్యాటింగ్ చేస్తోంది. మరోవైపు ముంబై ఇండియన్స్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌, స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య దూరమయ్యాడు. అతడి స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ తాత్కాలిక సారథిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.


టాస్‌ సమయంలో ముంబై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యకు బదులు సూర్యకుమార్‌ యాదవ్‌ మైదానంలోకి వచ్చాడు. దీంతో హార్దిక్‌ జట్టుకు దూరమైన విషయం తెలిసింది. హార్దిక్ పాండ్య గురించి సూర్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. స్వల్ప అనారోగ్యం కారణంగా హార్దిక్‌ పాండ్య మ్యాచ్‌కు అందుబాటులో ఉండలేకపోయాడని తెలిపాడు. అదే విధంగా... తమ తుదిజట్టులో మూడు మార్పులు జరిగినట్లు వెల్లడించాడు.


హార్దిక్‌ పాండ్య స్థానంలో దీపక్‌ చాహర్‌ వచ్చినట్లు సూర్య తెలిపాడు. ఇక ట్రెంట్‌ బౌల్ట్‌ స్థానంలో దీపక్‌ చహర్‌, అల్లా ఘజన్‌ఫర్‌ స్థానంలో మిచెల్‌ శాంట్నర్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఆడుతున్నట్లు సూర్య పేర్కొన్నాడు. మరోవైపు.. తమ తుదిజట్టులో ఎలాంటి మార్పులు లేవని ఢిల్లీ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ తెలిపాడు. స్టార్ ఆల్ రౌండర్ పాండ్య లేకపోవడం ముంబై జట్టుకు భారీ ఎదురు దెబ్బేనని క్రీడా నిపుణులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: కోహ్లీ రికార్డుపై కన్నేసిన రోహిత్...

టాస్ గెలిచిన ఢిల్లీ.. బ్యాటింగ్ ఎవరిదంటే...

Updated Date - Apr 04 , 2026 | 04:43 PM