Share News

ఐపీఎల్ 2026: కోహ్లీ రికార్డుపై కన్నేసిన రోహిత్...

ABN , Publish Date - Apr 04 , 2026 | 03:24 PM

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(శ‌నివారం) డ‌బుల్ హెడ‌ర్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, ముంబై ఇండియ‌న్స్ తలపడనున్నాయి. ఈ నేప‌థ్యంలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డు ఒకటి.. ముంబై ఇండియ‌న్స్ సీనియ‌ర్ బ్యాట‌ర్ రోహిత్ శ‌ర్మను ఊరిస్తోంది.

ఐపీఎల్ 2026: కోహ్లీ రికార్డుపై కన్నేసిన రోహిత్...
Rohit Sharma record

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(శ‌నివారం) డ‌బుల్ హెడ‌ర్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, ముంబై ఇండియ‌న్స్ తలపడనున్నాయి. ఈ నేప‌థ్యంలో ముంబై ఇండియ‌న్స్ సీనియ‌ర్ బ్యాట‌ర్ రోహిత్ శ‌ర్మను స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డు ఊరిస్తోంది. మరి.. ఆ రికార్డు వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...


ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై రోహిత్ శ‌ర్మ ఇప్పటి వ‌ర‌కు 37 మ్యాచ్‌ల్లో 1057 ప‌రుగులు సాధించాడు. అతడి కంటే ముందు విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఈ ఆర్సీబీ స్టార్... ఢిల్లీ క్యాపిటల్స్ పై 30 ఇన్నింగ్స్‌ల్లో 1,130 ప‌రుగులు సాధించాడు. కోహ్లీ కంటే రోహిత్ 73 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉన్నాడు. ఇవాళ ఢిల్లీతో మ్యాచ్‌లోనే ఆ ఫీట్‌ను సాధిస్తాడా లేదా అనేది చూడాలి. ఈ సీజ‌న్‌ను రోహిత్ శ‌ర్మ మంచి ఈజ్‌తో ప్రారంభించన సంగతి తెలిసిందే. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లోనే రోహిత్ 38 బంతుల్లోనే 78 ప‌రుగులు సాధించాడు.


అత‌డి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. అయితే, ఇవాళ కోహ్లీ రికార్డును రోహిత్ బ్రేక్ చేయడం అంత సులభం కాదు. ఎందుకంటే ఢిల్లీ బౌలింగ్ విభాగం చాలా బలంగా ఉంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆ జట్టును కేవలం 141 పరుగులకే ఢిల్లీ పరిమితం చేసింది. అయితే ఇవాళ్టి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో పోలిస్తే ముంబై ఇండియ‌న్స్ ఫేవ‌రెట్‌గా క‌నిపిస్తోంది. ఐదుసార్లు ఛాంపియ‌న్ అయిన ముంబై 21-16 విజ‌యాల‌తో ఢిల్లీపై ఆధిక్యంలో ఉంది. గ‌త ఐదు మ్యాచ్‌ల్లో ఢిల్లీపై ముంబై నాలుగు విజ‌యాలు సాధించ‌డం విశేషం.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన ఢిల్లీ.. బ్యాటింగ్ ఎవరిదంటే...

భారత్‌తో స్నేహం కోసం.. బీసీసీఐకి లేఖ రాసిన బంగ్లా క్రికెట్ బోర్డ్ డైరెక్టర్..

Updated Date - Apr 04 , 2026 | 03:33 PM