Share News

అర్ధ సెంచరీతో రాణించిన ఆయుష్ మాత్రే.. చెన్నై స్కోర్ 209

ABN , Publish Date - Apr 03 , 2026 | 09:30 PM

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(శుక్రవారం) చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 5 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది.

అర్ధ సెంచరీతో రాణించిన ఆయుష్ మాత్రే.. చెన్నై స్కోర్ 209
Ayush Matre Shines

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(శుక్రవారం) చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన సీఎస్కే తొలుత బ్యాటింగ్ చేసింది. యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే(73) అర్ధ సెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. సీఎస్కే ఓపెనర్ సంజు శాంసన్ మరోసారి విఫలమయ్యాడు. తొలి మ్యాచ్‌లో ఆరు పరుగులు చేసిన సంజు.. పంజాబ్ కింగ్స్ పై అదనంగా ఒక పరుగు జోడించి ఏడు పరుగులకే పెవిలియన్ చేరాడు.


సీఎస్కే బ్యాటర్లలో శివం దూబె(45*), సర్ఫరాజ్ ఖాన్(32), రుత్‌రాజ్ గైక్వాడ్(28) రాణించారు. ముఖ్యంగా శివం దూబె పంజాబ్ బౌలర్లపై విరుచకపడ్డాడు. కేవలం 27 బంతుల్లోనే 45 పరుగులతో అజేయంగా నిలిచాడు. అలానే సర్ఫారాజ్ ఖాన్ సైతం చెలరేగి ఆడాడు. కేవలం 12 బంతుల్లోనే 32 పరుగులు చేసి.. విజయ్ కుమార్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఇక పంజాబ్ బౌలర్లలో విజయ్ కుమార్ రెండు వికెట్లు సాధించగా.. జేవియర్ బార్ట్ లెట్, మార్కో యాన్సెన్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీశారు. మొత్తంగా పంజాబ్ ముందు సీఎస్కే 210 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది.


ఆయుష్ మాత్రే రికార్డ్

ఈ మ్యాచ్‌లో యువ బ్యాటర్ ఆయుశ్‌ మాత్రే చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో సీఎస్కే తరఫున అర్ధ సెంచరీ చేసిన అతి పిన్నవయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. మాత్రే కంటే ముందు ఈ రికార్డు సురేశ్‌ రైనా పేరిట ఉండేది. రైనా ఐపీఎల్‌ అరంగేట్రం ఎడిషన్‌లో (2008) 21 ఏళ్ల 148 రోజుల వయసులో హాఫ్ సెంచరీ చేశాడు. తాజాగా మాత్రే ఆ రికార్డును బద్దలు కొడుతూ 18 రోజుల 261 రోజుల వయసులో అర్ధ శతకం పూర్తి చేశాడు. ఈ విభాగంలో మాత్రే, రైనా తర్వాతి స్థానంలో పార్థివ్‌ పటేల్‌ (23 ఏళ్ల 76 రోజుల, 2008) ఉన్నాడు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: నిరాశలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు

అజింక్య ర‌హానేపై వేటు.. కేకేఆర్ కెప్టెన్‌గా రింకు సింగ్?

Updated Date - Apr 03 , 2026 | 09:55 PM