Share News

ఎల్పీజీ సరఫరా స్థిరంగా, పూర్తి అందుబాటులో ఉంది: ఐఓసీ

ABN , Publish Date - Apr 03 , 2026 | 09:28 PM

పశ్చిమాసియాలో ఘర్షణల కారణంగా ఎల్‌పీజీ సరఫరాకు కలుగుతున్న అంతరాయంపై ఆందోళనల నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) శుక్రవారంనాడు కీలక వివరణ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరా స్థిరంగా, పూర్తి అందుబాటులో ఉందని ప్రకటించింది.

ఎల్పీజీ సరఫరా స్థిరంగా, పూర్తి అందుబాటులో ఉంది: ఐఓసీ
LPG

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఎల్‌పీజీ (LPG) సరఫరాకు కలుగుతున్న అంతరాయంపై ఆందోళనల నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) శుక్రవారంనాడు కీలక వివరణ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరా స్థిరంగా, పూర్తి అందుబాటులో ఉందని ప్రకటించింది. వినియోగదారులు ప్యానిక్ బుకింగ్‌కు, అక్రమ నిల్వలకు పాల్పడవద్దని కోరింది.


ప్రస్తుత ఉద్రిక్తతలకు ముందు సరఫరా చేసినట్టు ప్రతిరోజూ సుమారు 28 లక్షల ఎల్పీజీ సిలెండర్లను డెలివరీ చేస్తున్నామని, గృహావసరాలకు సిలెండర్ల సరఫరా నిరంతరాయంగా జరుగుతోందని ఐఓసీ తెలిపింది. 87 శాతం రీఫిల్ బుకింగ్‌లు డిజిటల్ ఫ్లాట్‌ఫాంల ద్వారానే జరుగుతున్నాయని, ఓటీపీ-బేస్డ్ సిస్టమ్స్ ద్వారానే కస్టమర్లకు సిలెండర్లు రీచ్ అవుతున్నాయని పేర్కొంది.


ప్రస్తుత పరిణామాలు గ్లోబల్ ఇంధన మార్గెట్లపై ప్రభావం చూపిస్తున్నాయని, అయితే ఇండియాలో మాత్రం ఎల్పీజీ సరఫరా నిలకడగా ఉందని ఐఓసీ తెలిపింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నామని, గృహావసరాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పింది. ఎల్పీజీ రీఫిల్స్ బుకింగ్ కోసం ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ వంటి డిజిటల్ మోడ్స్‌ వినియోగాన్ని ప్రోత్సహిస్తామని తెలిపింది. అవకతవకలకు పాల్పడుతున్న 141 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లపై చర్చలు తీసుకున్నామని, ఐదుగురిని సస్పెండ్ చేశామని వివరించింది.


ఇవి కూడా చదవండి..

పుదుచ్చేరిలో మోదీ భారీ రోడ్‌షో.. రెండోసారి కోటలో పాగాకు ప్రచారం

అప్పుడు నాలుగు పెళ్లిళ్లు చేసుకోలేరు.. అస్సాం ప్రచారంలో అమిత్‌షా

Updated Date - Apr 03 , 2026 | 09:40 PM