పుదుచ్చేరిలో మోదీ భారీ రోడ్‌షో.. రెండోసారి కోటలో పాగాకు ప్రచారం
ABN , Publish Date - Apr 03 , 2026 | 08:38 PM
జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA)కి మద్దతు కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పుదుచ్చేరి (Puducherry)లో శుక్రవారంనాడు భారీ రోడ్‌షో నిర్వహించారు. ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి, పాండిచ్చేరి హోం మంత్రి ఎ.నమశ్సివాయం సైతం ఈ రోడ్‌షోలో పాల్గొన్నారు.
పుదుచ్చేరి: జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA)కి మద్దతు కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పుదుచ్చేరి (Puducherry)లో శుక్రవారంనాడు భారీ రోడ్‌షో నిర్వహించారు. ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి, పాండిచ్చేరి హోం మంత్రి ఎ.నమశ్సివాయం సైతం ఈ రోడ్‌షోలో పాల్గొన్నారు.
అజంతా సిగ్నల్ పాయింట్, కామరాజ్ విగ్రహం-రాజా థియేటర్ సిగ్నల్ మధ్య సుమారు రెండు కిలోమీటర్ల మేర గంటసేపు రోడ్‌షో జరిగింది. సాంస్కృతిక ప్రదర్శనలు, సాంప్రదాయ నృత్యాలు ముందుకు సాగగా, బీజేపీ కార్యకర్తలు, అల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్‌స్) కార్యకర్తలు పార్టీ జెండాలతో పెద్దఎత్తున పాల్గొన్నారు.
దీనికి ముందు, పుదుచ్చేరి చేరుకున్న ప్రధానమంత్రికి బీజేపీ మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు. 'జైశ్రీరామ్' 'భారత్ మాతా కీ జై' నినాదులు హోరెత్తించారు. ప్రధాన కాన్వాయ్‌పై పూలజల్లులు కురిపించారు. పుదుచ్చేరిలో ఎఐఎన్‌ఆర్‌సీ-బీజేపీ కూటమి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు విస్తృత ప్రచారం సాగిస్తున్న తరుణంలో మోదీ రోడ్‌షోతో ప్రచారం మరింత ఊపందుకుంది. ఇటీవల పుదుచ్చేరి బీజేపీ కార్యకర్తలతో వర్చువల్ షోలోనూ మోదీ పాల్గొని వారిని మరింత ఉత్సాహపరిచారు. ఈ ఎన్నికల్లో సీట్ల పంపకాల్లో భాగంగా ఏఐఎన్‌ఆర్‌సీ 16 స్థానాల్లోనూ, బీజేపీ 10 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాయి. కూటమిలో ఇతర భాగస్వాములుగా ఉన్న ఆన్నాడీఎంకే, లాట్చియ జననాయగ కట్చి (ఎల్‌జేకే) చెరో రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. పుదుచ్చేరి అసెంబ్లీకి ఏప్రిల్ 9న పోలింగ్ జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
అప్పుడు నాలుగు పెళ్లిళ్లు చేసుకోలేరు.. అస్సాం ప్రచారంలో అమిత్‌షా
అన్నామలైకి బీజేపీ నో టిక్కెట్.. కారణం ఏమిటంటే..