Share News

అన్నామలైకి బీజేపీ నో టిక్కెట్.. కారణం ఏమిటంటే..

ABN , Publish Date - Apr 03 , 2026 | 05:21 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 27 మంది పార్టీ అభ్యర్థులను బీజేపీ శుక్రవారంనాడు ప్రకటించింది. కీలక నేతలైన పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు నాగేంద్రన్, కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, తమిళిసై సౌందరరాజన్‌కు పార్టీ టిక్కెట్ దక్కినప్పటికీ, పార్టీ మాజీ అధ్యక్షుడు, కీలక నేత కె.అన్నామలైకి ఈ జాబితాలో చోటుదక్కలేదు.

అన్నామలైకి బీజేపీ నో టిక్కెట్.. కారణం ఏమిటంటే..
Annamalai

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 27 మంది పార్టీ అభ్యర్థులను బీజేపీ శుక్రవారంనాడు ప్రకటించింది. కీలక నేతలైన పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు నాగేంద్రన్, కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, తమిళిసై సౌందరరాజన్‌కు పార్టీ టిక్కెట్ దక్కినప్పటికీ, పార్టీ మాజీ అధ్యక్షుడు, కీలక నేత కె.అన్నామలైకి ఈ జాబితాలో చోటుదక్కలేదు.


అన్నామలై 2021 జూలై నుంచి ఏప్రిల్ 2025 వరకూ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా ఉన్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీకి ఆయనను పార్టీ అధిష్ఠానం దూరంగా ఉంచింది. దీనిపై నాగేంద్రన్‌ను అడిగినప్పుడు, పార్టీ కేంద్ర నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. పార్టీ ప్రకటించిన 27 మంది కచ్చితంగా నెగ్గితీరుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


అన్నామలై-బీజేపీ మధ్య దూరం పెరిగిందా?

అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలైకు టిక్కెట్ ఇవ్వకపోవడం వెనుక కారణాలపై తాజాగా చర్చజరుగుతోంది. బీజేపీ-అన్నాడీఎంకే మధ్య సీట్ల పంపకాలపై మొదట్నించీ అన్నామలై అసంతృప్తితో ఉన్నారు. దీనితోపాటు, బీజేపీ సునాయాసంగా నెగ్గే సీట్లను అన్నాడీఎంకే కేటాయించ లేదంటూ బీజేపీ అధిష్ఠానానికి ఆయన లేఖ రాశారు. ఈసారి పోటీకి తనను దూరంగా ఉంచాలని కూడా అధిష్ఠానాన్ని ఆయన కోరినట్టు చెబుతున్నారు. అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తును అన్నామలై ఏనాడూ సమర్ధించలేదు. ఎన్డీయేలోకి అన్నాడీఎంకే తిరిగి రావాలంటే అన్నామలైను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని పొత్తులకు ముందు బీజేపీ అధిష్ఠానం ముందు ఎడప్పాడి కె పళనిస్వామి షరతు పెట్టినట్టు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తదనంతర క్రమంలో తన తండ్రికి అనారోగ్యంగా ఉందంటూ పార్టీ అధ్యక్ష పదవికి అన్నామలై రాజీనామా చేయడం, నాగేంద్రన్ ఆ పదవిని చేపట్టడం జరిగింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురిచ్చి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అన్నామలై పోటీ చేశారు. డీఎంకే అభ్యర్థి ఆర్.ఇలాంగో చేతిలో 24,000 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.


ఇవి కూడా చదవండి..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ..

తమిళనాడు ఎన్నికలు.. 27 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

Updated Date - Apr 03 , 2026 | 05:29 PM