Share News

అజింక్య ర‌హానేపై వేటు.. కేకేఆర్ కెప్టెన్‌గా రింకు సింగ్?

ABN , Publish Date - Apr 03 , 2026 | 07:54 PM

ఐపీఎల్‌ 2026లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా రెండో ఓటమిని మూటకట్టుకుంది. గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగాహైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో ‍కేకేఆర్ చిత్తు అయింది. దీంతో అజింక్య రహానే కెప్టెన్సీపై సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

అజింక్య ర‌హానేపై వేటు.. కేకేఆర్ కెప్టెన్‌గా రింకు సింగ్?
Kolkata Knight Riders

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్‌ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా రెండో సారి ఓడింది. నిన్న(గురువారం) ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో కోల్ కతా ఘోర ఓటమిని మూటగట్టుకుంది. 2012 తర్వాత కేకేఆర్ వరుసగా మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో అజింక్యా రహానేను సీజన్‌ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పించే ఆలోచనలో కేకేఆర్ యాజమాన్యం ఉన్నట్లు సమాచారం.


అజింక్యా రహానే స్ధానంలో స్టార్ ఫినిషర్ రింకు సింగ్ జట్టు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని 'రాయ్‌స్పోర్ట్స్' ప్రతినిధి సందీపన్ బెనర్జీ పేర్కొన్నారు. రింకూ ప్రస్తుతం కేకేఆర్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా రహానే గాయంతో మైదానం వీడినప్పుడు రింకు కెప్టెన్ గా వ్యవహించాడు. కానీ 221 పరుగుల భారీ ఛేదనను అడ్డుకోవడంలో అతను విఫలమయ్యాడు. ఆ ఒక్క మ్యాచ్ మినహా, ఐపీఎల్‌లో ఒక జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం రింకు సింగ్‌కు లేదు. కానీ 2024-25 దేశవాళీ సీజ‌న్‌లో ఉత్తర్‌ప్రదేశ్ జ‌ట్టు కెప్టెన్‌గా రింకూ వ్యవ‌హ‌రించాడు. ఈ క్రమంలోనే అత‌డికి పూర్తి స్ధాయి బాధ్యతల‌ను అప్పగించాల‌ని కేకేఆర్ ఫ్రాంఛైజీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

మ్యాచ్‌ల సంఖ్య పెంపు!.. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Apr 03 , 2026 | 08:00 PM