ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్
ABN , Publish Date - Apr 03 , 2026 | 06:40 PM
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(శుక్రవారం)మరో రసవత్తర పోరు జరగనుంది. మరికాసేపట్లో చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(శుక్రవారం)మరో రసవత్తర పోరు జరగనుంది. మరికాసేపట్లో చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన పంజాబ్.. బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై జట్టు మొదటి బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం పంజాబ్ కింగ్స్ ఎలాంటి మార్పులు చేయకపోగా.. సీఎస్‌కే ఓ మార్పు చేసింది. మాథ్యూ షార్ట్ స్థానంలో ప్రశాంత్ వీర్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిన సీఎస్కే.. ఈసారి తన హోం గ్రౌండ్ చెపాక్‌లో బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్‌పై అద్భుత విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ అదే ఊపులో చెన్నైనూ మట్టికరిపించాలని ఆతృతగా ఉంది.
తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్:
సంజు శాంసన్(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుష్ మ్హత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివం దూబె, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్
ఇంపాక్ట్ సబ్‌లు: జామీ ఓవర్టన్, రాహుల్ చాహర్, మాథ్యూ షార్ట్, రామకృష్ణ ఘోష్, గుర్జప్నీత్ సింగ్
పంజాబ్ కింగ్స్:
ప్రభ్ సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, నేహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
ఇంపాక్ట్ సబ్‌లు: సూర్యాంశ్ షెడ్జ్, ప్రియాంష్ ఆర్య, విష్ణు వినోద్, ప్రవీణ్ దూబే, హేమంత్ బ్రార్
ఇవి కూడా చదవండి:
మ్యాచ్‌ల సంఖ్య పెంపు!.. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ కీలక వ్యాఖ్యలు
సంజు క్లిక్ అయితే చెన్నైని ఆపడం కష్టం: క్రిష్