టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్.. భారత్ గెలవాలని శారీ మారథాన్..
ABN , Publish Date - Mar 08 , 2026 | 07:50 PM
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా టీ-20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. తుది పోరులో భారత్-న్యూజిలాండ్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి.
గుజరాత్: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium) వేదికగా టీ-20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ (T20 World Cup Final Match 2026) జరుగుతోంది. తుది పోరులో భారత్-న్యూజిలాండ్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఫైనల్ మ్యాచ్ కావడంతో ఎవరు గెలుస్తారా?, కప్ ఎవరి చేతికి వెళ్తుందా? అని క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా మ్యాచ్‌ను తిలకిస్తున్నారు.
ఇప్పటికే మైదానంలో భారత్, కివీస్ ప్లేయర్స్ హోరాహోరీగా తలపడుతున్నారు. భారత్ బ్యాటింగ్ చేస్తుండగా స్టేడియంలో మ్యాచ్‌ను అభిమానులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. మరోవైపు కోట్లాది మంది అభిమానులు టీవీలకు అతుక్కుపోయారు. అయితే, మ్యాచ్ సందర్భంగా ఇవాళ(ఆదివారం) గుజరాత్ రాష్ట్రం వడోదరలో మహిళలు శారీ మారథాన్ నిర్వహించారు. మారథాన్‌లో భాగంగా వేల మంది మహిళలు ఒక్కచోటికి చేరి చీరలు ధరించి పరుగులు తీశారు. అలాగే శారీల్లోనే నృత్యాలు చేస్తూ అలరించారు. భారత్ గెలవాలని వారంతా ఆకాంక్షించారు.
మరోవైపు దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు పూజలు నిర్వహిస్తున్నారు. 2024 మాదిరిగానే మరోసారి భారత్ టీ-20 కప్‌ను కైవసం చేసుకోవాలని ఇష్టదైవాలను కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లాలో ప్రత్యేక పూజలు చేశారు క్రికెట్ అభిమానులు. నీలకంఠాపురం దేవస్థానంలో స్వామివారికి పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి భారత్ గెలవాలని స్వామివారిని కోరుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
మారిన ఐపీఎల్ 2026 ప్రారంభం తేదీ..