విజయంతో ముగించాలని..
ABN , Publish Date - Nov 27 , 2026 | 05:48 AM
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్‌దే ఆధిపత్యం సాగినా చివరకు డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇది కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు కోచ్ గంభీర్‌కు కూడా...
తెల్లవారుజాము 3.30 నుంచి
సోనీ స్పోర్ట్స్‌లో
ఆఖరి పోరుకు భారత్ సిద్ధం
న్యూజిలాండ్‌తో రెండో టెస్టు నేటినుంచే
సిరాజ్‌కు చోటిస్తారా?
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్‌దే ఆధిపత్యం సాగినా చివరకు డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇది కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు కోచ్ గంభీర్‌కు కూడా అసంతృప్తిని కలిగించింది. బేసిన్ రిజర్వ్ మైదానం సహజంగా సీమర్లకు అనుకూలిస్తుంటుంది. కానీ వికెట్ ఫ్లాట్‌గా మారి పరుగుల వరదకు అవకాశమిచ్చింది. ఈనేపథ్యంలో శుక్రవారం నుంచి ఇరు జట్ల మధ్య చివరిదైన రెండో టెస్టు ఆరంభం కానుంది. ఇందులో గెలిచిన జట్టుకే సిరీస్ దక్కుతుంది. అలాగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్స్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్‌కు ఈ గెలుపు తప్పనిసరి. ఒకవేళ కివీస్ గెలిస్తే డబ్ల్యూటీసీ టేబుల్‌లో రెండో స్థానానికి చేరుతుంది.
తుది జట్టుపై ఆసక్తి: స్థానిక హ్యాగ్లీ ఓవల్ పిచ్‌పై పేసర్లు సవాల్ విసిరే అవకాశం ఉండడంతో భారత జట్టు బౌలింగ్ కూర్పు పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే.. తొలి టెస్టుకు పేసర్ సిరాజ్‌ను పక్కనబెట్టడం విమర్శలకు తావిచ్చింది. ఆ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా మినహా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. ప్రసిద్ధ్ కృష్ణ, అన్షుల్ కాంబోజ్ రెండు ఇన్నింగ్స్‌లోనూ విఫలమయ్యా రు. ఈనేపథ్యంలో రెండో టెస్టుకైనా పేసర్ సిరాజ్‌ను జట్టులోకి తీసుకుంటారా? అనేది చర్చనీయాంశమైంది. ఎనిమిదో నెంబర్ వరకు బ్యాటింగ్ ఉండాలన్న ఆలోచనతో తొలి టెస్టులో ఆకాశ్, అన్షుల్ ఇద్దరినీ కొనసాగించారు. కానీ ఈ టెస్టుకు అన్షుల్‌తో పాటు ప్రసిద్ధ్ స్థానం కూడా సందేహంగా మారింది. మరోవైపు పేసర్ గుర్నూర్ బ్రార్ ఎత్తు కూడా ఈ పిచ్‌పై ఉపయోగపడుతుంద న్న ఆలోచనలో జట్టు మేనేజ్‌మెంట్ ఉంది. కాబట్టి వీరి స్థానాల్లో సిరాజ్, బ్రార్‌లను ఆడించే అవకాశాలను తోసిపుచ్చలే ము. ఒకవేళ ప్రసిద్ధ్‌పై మాత్రమే వేటు పడితే బ్రార్ వైపు మొగ్గుచూపవచ్చు. అదే జరిగితే సిరాజ్‌కు మళ్లీ నిరాశ తప్పదు. అలాగే స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఎంపిక కూడా విమర్శలకు గురికావడంతో అతడి స్థానంలో వెటరన్ జడేజాను ఆడిస్తారా? అనేది కూడా వేచిచూడాల్సిందే. మరోవైపు బ్యాటింగ్ విభాగం మాత్రం అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. ఫ్లాట్ ట్రాక్‌పై దాదాపుగా అందరు బ్యాటర్లు అదరగొట్టారు.
ఆత్మవిశ్వాసంతో కివీస్: తొలి టెస్టును పట్టుదలగా ఆడి డ్రా చేసుకున్న ఆతిథ్య న్యూజిలాండ్ ఈసారి గెలుపే ధ్యేయంగా బరిలోకి దిగనుంది. బ్యాటింగ్‌లో కాన్వే, నికోల్స్, మిచెల్, ఫిలి ప్స్ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నా రు. అయితే కెప్టెన్ లాథమ్ ఫామ్ ఆందోళనగా ఉంది. రెండు ఇన్నింగ్స్‌లోనూ డకౌటైన అతడిపై ఒత్తిడి ఉంది. ఇక ఫ్లాట్ ట్రాక్‌పై బౌలర్లు చేసేదేమీ లేకపోయింది.డఫీ ఏకంగా 200+ పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఈ టెస్టుకు అతడి స్థానంలో మ్యాట్ ఫిషర్‌ను ఆడించవచ్చు.
వర్షం ముప్పు!
క్రైస్ట్‌చర్చ్‌లో బుధవారం సాయంత్రం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు వర్షం కురవడంతో.. పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. అలాగే రెండు జట్లు ఇండోర్స్‌లోనే నెట్ ప్రాక్టీస్ చేశాయి. కానీ శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రం ఆటకు వాతావరణం అనుకూలించవచ్చు. అయితే సోమ, మంగళవారాల్లో కురిసే వర్షాలతో ఆటంకం తప్పదు. పిచ్ పేసర్లకు సహకరించే అవకాశం ఉంది. కాగా 2020లో భారత్ ఇక్కడ ఆడిన ఏకైక టెస్టు మూడు రోజుల్లోనే ముగిసి కివీస్ ఏడు వికెట్లతో నెగ్గింది.
తుది జట్లు (అంచనా): యశస్వీ జైస్వాల్, రాహుల్, దేవ్‌దత్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), పంత్, జురెల్, సుందర్/జడేజా, అన్షుల్/సిరాజ్, ఆకాశ్‌దీ్‌ప, బుమ్రా, ప్రసిద్ధ్/గుర్నూర్.
న్యూజిలాండ్: లాథమ్ (కెప్టెన్), కాన్వే, నికోల్స్, రచిన్, మిచెల్, బ్లండెల్, ఫిలిప్స్, స్మిత్, జేమిసన్, హెన్రీ, ఫిషర్/డఫీ.
ఈ వార్తలు కూడా చదవండి...
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్
యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News