వరల్డ్ కప్-2026: ఫైనల్‌లో శతక్కొట్టిన వైభవ్..
ABN , Publish Date - Feb 06 , 2026 | 02:38 PM
హరారే వేదికగా జరుగుతోన్న అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ లో యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ శతకంతో చెలరేగి ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై దండయాత్ర చేస్తున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తుది పోరులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.
స్పోర్ట్స్ డెస్క్: అండర్-19 ప్రపంచ కప్(Under 19 World Cup) ఫైనల్‌లో ఇంగ్లాండ్ తో యువ భారత్ తలపడుతోంది. హరారే వేదికగా ఇవాళ(శుక్రవారం) జరుగుతున్న తుదిపోరులో టాస్ గెలిచిన టీమిండియా(India) బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇంగ్లీష్ బౌలర్లపై దండయాత్ర చేస్తున్నాడు. కేవలం 32 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ యువ హిట్టర్.. ఆ తర్వాత గేర్ మార్చి... మరింత స్పీడ్ తో బౌండరీలు బాదుతున్నాడు. ఈ క్రమంలో 55 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇందులో 8 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి.
ఓపెనర్లలో ఆరోన్ జార్జ్ విఫలమయ్యాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేసి.. అలెక్స్ గ్రీన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. మరోవైపు14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ నెమ్మదిగా తన ఆటను ఆరంభించి.. తర్వాత వేగం పెంచాడు. ఫలితంగా 32 బంతుల్లో అర్ధ శతకం, 55 బంతుల్లో సెంచరీ సాధించాడు. అలానే వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ ఆయుష్ మాత్రే(53) హాఫ్ సెంచరీతో రాణించాడు. వీరిద్దరూ 142 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక భారత్ స్కోర్ 162 పరుగుల వద్ద దూకుడు మీద ఉన్న మాత్రే.. అలెక్స్ బౌలింగ్ లోనే ఔటయ్యాడు. ప్రస్తుతం వైభవ్(118*), వేదాంత్ త్రివేది(2*) బ్యాటింగ్ చేస్తోన్నారు. 21 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయిన భారత్ 185 పరుగులు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు: సీఎం
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు