అండర్-19 మహిళల ఆసియా కప్ 2026కు భారత జట్టు ప్రకటన..
ABN , Publish Date - Nov 28 , 2026 | 07:25 PM
అండర్-19 మహిళల ఆసియా కప్2026 కోసం డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా వికెట్ కీపర్, బ్యాటర్ భావిక అహిరేను సెలక్టర్లు ఎంపిక చేశారు.
స్పోర్ట్స్ డెస్క్: అండర్-19 మహిళల ఆసియా కప్2026 కోసం డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా వికెట్ కీపర్, బ్యాటర్ భావిక అహిరేను సెలక్టర్లు ఎంపిక చేశారు.అలానే వైస్ కెప్టెన్‌గా అనాది టాగ్డే వ్యవహరించనుంది. అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ 2027ను దృష్టిలో ఉంచుకుని ఈ జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు.
ప్రస్తుతం యువ మహిళా భారత్ జట్టు స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండో టీ20ల్లోనూ విజయం సాధించి 2-0 ఆధిక్యంలో టీమిండియా కొనసాగుతోంది. ఈ సిరీస్‌లో యువ ఓపెనర్ అచ్సా పర్మార్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. తొలి మ్యాచ్‌లో 52 పరుగులు చేసిన ఆమె.. రెండో టీ20లో 81 పరుగులతో ఆకట్టుకుంది.
టాప్ ఆర్డర్‌లో దీయా యాదవ్ అద్భుతంగా రాణిస్తోంది. తొలి టీ20లో 29 పరుగులు చేసిన ఈ యువ బ్యాటర్, రెండో మ్యాచ్‌లో 87 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. ప్రస్తుత భారత జట్టు ప్రదర్శన చూస్తుంటే మరోసారి ఆసియాకప్ ట్రోఫీని ముద్దాడడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఈ టోర్నీ డిసెంబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. 2024 తర్వాత జరుగుతున్న అండర్-19 మహిళల ఆసియా కప్ ఇది కేవలం రెండవ ఎడిషన్. ఈ టోర్నీ గత ఎడిషన్ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి భారత్ ఛాంపియన్‌గా నిలిచింది.
భారత అండర్-19 జట్టు:
భావిక అహిరే (కెప్టెన్, వికెట్ కీపర్), ఇరా జాదవ్, నిధి మహతో, పూర్వా సివాచ్, మహక్ నర్వాసే, మైత్రి మణియార్, ఈశ్వరి అవాసరే, దీయా యాదవ్, శ్రేయ ఎస్ చవాన్ (వికెట్ కీపర్), సమైరా రాఘవ్, కుమారి పాలక్, ఉమా కాష్వి, అచ్సా పర్మార్, అనాది టాగ్డే (వైస్ కెప్టెన్), పాలక్ సింగ్.
ఇవి కూడా చదవండి:
కేకేఆర్ కెప్టెన్‌గా రింకు సింగ్? ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు!
క్లోయ్ ట్రయాన్ విధ్వంసం..16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. !