మనోళ్లు చిత్తయ్యారు
ABN , Publish Date - Nov 27 , 2026 | 05:41 AM
పసలేని బౌలింగ్.. అంతకంటే ఘోరమైన ఫీల్డింగ్‌తో పేలవ ప్రదర్శన కనబరచిన భారత్-ఎ.. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ నుంచి అవుటైంది. లసిత్ క్రూస్‌పుల్లే (116), సినెత్ జయవర్దన (105) శతకాలతో...
లసిత్, జయవర్దన శతకాలు
ఫైనల్లో శ్రీలంక-ఎ
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్
దోహా: పసలేని బౌలింగ్.. అంతకంటే ఘోరమైన ఫీల్డింగ్‌తో పేలవ ప్రదర్శన కనబరచిన భారత్-ఎ.. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ నుంచి అవుటైంది. లసిత్ క్రూస్‌పుల్లే (116), సినెత్ జయవర్దన (105) శతకాలతో అదరగొట్టడంతో.. గురువారం జరిగిన సెమీ్‌సలో 8 వికెట్ల తేడాతో భారత్-ఎను ఓడించిన శ్రీలంక-ఎ ఫైనల్‌కు దూ సుకెళ్లింది. తొలుత భారత్ 50 ఓవర్లలో 317/8 స్కోరు చేసింది. అభిషేక్ శర్మ (78), షాబాజ్ అహ్మద్ (54 నాటౌట్), తిలక్ వర్మ (53) అర్ధ శతకాలు వృథా అయ్యాయి. వైభవ్ సూర్యవంశీ (40) మెరుపులు మెరిపించలేకపోయాడు. ఫెర్నాండో, జనిత్ లియానగె చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో శ్రీలంక-ఎ 41.3 ఓవర్లలో 318/2 స్కోరు చేసి గెలిచింది. ఓపెనర్లు లసిత్, జయవర్దన తొలి వికెట్‌కు 174 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో మ్యాచ్ ఏకపక్షమైంది. జయవర్దనను షాబాజ్ క్యాచవుట్ చేసినా.. లసిత్, వన్‌డౌన్ బ్యాటర్ నిషాన్ మదుష్క (58 నాటౌట్) రెండో వికెట్‌కు 91 పరుగులతో గెలు పు బాటలో నిలిపారు. విజయానికి 53 పరుగు లు కావాల్సి ఉండగా.. రాణా బౌలింగ్‌లో లసిత్ వెనుదిరిగాడు. కానీ, కెప్టెన్ పవన్ రత్నాయకే (31 నాటౌట్), మదుష్క మరో 51 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించారు. జయవర్దనె ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
రాణించిన టాపార్డర్..: అభిషేక్, తిలక్‌తోపాటు షాబాజ్ అర్ధ శతకాలతో భారత్ పోరాడగలిగే స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న భారత్‌కు ఓపెనర్లు వైభవ్, అభిషేక్ తొలి వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యంతో అదిరే ఆరంభాన్నిచ్చారు. అయితే, 8వ ఓవర్‌లో సూర్యవంశీని జనిత్ క్యాచవుట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ తిలక్, అభిషేక్ రెండో వికెట్‌కు 79 పరుగులతో.. భారీ స్కోరుకు బాటలు వేశారు. కానీ, కీలక సమయంలో అభిషేక్‌ను లాహిరు పెవిలియన్ చేర్చాడు. ఇక, మధ్య ఓవర్లలో స్పిన్నర్లు చెలరేగడంతో.. కుశాగ్ర (21), తిలక్, రింకూ (12), సూర్యాంశ్ (10) వికెట్లను కోల్పోయిన భారత్ 235/6తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో షాబాజ్, తనుష్ (28) చివరి ఓవర్లలో ఆరో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో.. టీమ్ స్కోరు 300 మార్క్ దాటింది.
స్కోరుబోర్డు
భారత్-ఎ: వైభవ్ (సి) లసిత్ (బి) జనిత్ 40, అభిషేక్ (సి) జనిత్ (బి) లాహిరు 78, తిలక్ (ఎల్బీ) ఫెర్నాండో 53, కుశాగ్ర (సి) పవన్ (బి) ధనంజయ 21, రింకూ (ఎల్బీ) ఫెర్నాండో 12, షాబాజ్ (నాటౌట్) 54, సూర్యాంశ్ (సి) ఫెర్నాండో (బి) ధనంజయ 10, తనుష్ (సి) ఫెర్నాండో (బి) జనిత్ 28, రాణా (బి) సంకేత్ 0, హర్ష్ దూబే (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 50 ఓవర్లలో 317/8; వికెట్ల పతనం: 1-80, 2-159, 3-197, 4-203, 5-220, 6-235, 7-308, 8-309; బౌలింగ్: ఫెర్నాండో 10-0-60-2, సంకేత్ 8-0-64-1, లాహిరు 6-0-47-1, జనిత్ లియనాగె 5-0-37-2, వనూజ సహన్ 7-0-46-0, ధనంజయ 10-0-41-2, విజయ్‌కాంత్ 4-0-22-0.
శ్రీలంక-ఎ: లసిత్ (సి) రింకూ (బి) రాణా 116, జయవర్దన (సి) కోటియాన్ (బి) షాబాజ్ 105, మదుష్క (నాటౌట్) 58, పవన్ (నాటౌట్) 31; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 41.3 ఓవర్లలో 318/2; వికెట్ల పతనం: 1-174, 2-265; బౌలింగ్: హర్షిత్ 7-0-61-1, అర్షద్ 4-0-46-0, కోటియాన్ 6-0-48-0, సూర్యాంశ్ 2-0-23-0, హర్ష్ దూబే 10-0-56-0, రింకూ 2-0-17-0, షాబాజ్ 10-0-60-1, అభిషేక్ 0.3-0-4-0.
ఈ వార్తలు కూడా చదవండి...
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్
యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News