Share News

పంజాబ్‌కు ఆధిక్యం

ABN , Publish Date - Oct 29 , 2026 | 01:24 AM

హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్‌లో పంజాబ్‌కు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది.

పంజాబ్‌కు ఆధిక్యం
Vihaan Malhotra

  • హైదరాబాద్‌ 380 ఆలౌట్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్‌లో పంజాబ్‌కు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్‌ 193/2 స్కోరుతో బుధవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆతిథ్య జట్టు 380 రన్స్‌కు ఆలౌటైంది. విహాన్‌ మల్హోత్ర 4, హర్జస్‌, ఇమన్‌జోత్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. మొదటి ఇన్నింగ్స్‌లో 431 రన్స్‌ చేసిన పంజాబ్‌కు 51 పరుగుల కీలక ఆధిక్యం లభించింది.


అనంతరం పంజాబ్‌ మూడోరోజు ఆఖరికి వికెట్‌ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. విజయవాడలో ఆంధ్ర-చత్తీస్‌గఢ్‌ మధ్య జరుగుతున్న రంజీ పోరులో భారీ వర్షం కారణంగా.. మూడోరోజు ఆట రద్దయింది. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 231 రన్స్‌కు ఆలౌట్‌ కాగా, చత్తీస్‌గఢ్‌ 216/8తో ఆడుతోంది.


ఇవి కూడా చదవండి..

మోలినో జిగేల్‌

మళ్లీ టాప్‌నకు అభిషేక్‌

కాజల్‌, నీలమ్‌కు రజతాలు

Updated Date - Oct 29 , 2026 | 01:24 AM