Share News

మోలినో జిగేల్‌

ABN , Publish Date - Oct 29 , 2026 | 01:16 AM

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) మినీ వేలం బుధవారం ఇక్కడ ముగిసింది. 27 ఖాళీలకోసం 150 మంది పోటీపడిన ఈ వేలంలో 25 స్థానాలు భర్తీ అయ్యాయి.

మోలినో జిగేల్‌
Sophie Molineux

  • రూ. 1.10 కోట్లు పలికిన ఆసీస్‌ ఆల్‌రౌండర్‌

  • యూపీ వారియర్స్‌ సొంతం

  • డబ్ల్యూపీఎల్‌ మినీ వేలం

కోచి: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) మినీ వేలం బుధవారం ఇక్కడ ముగిసింది. 27 ఖాళీలకోసం 150 మంది పోటీపడిన ఈ వేలంలో 25 స్థానాలు భర్తీ అయ్యాయి. దీనికిగాను ఐదు ఫ్రాంచైజీలు కలిపి రూ. 6.25 కోట్లు వెచ్చించాయి. ఆస్ట్రేలియా కెప్టెన్‌ సోఫీ మోలినో వేలంలో అత్యధిక ధర పలికింది. 28 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌ కోసం యూపీ వారియర్స్‌, ఆర్సీబీ నువ్వా..నేనా..అనేలా పోటీపడ్డాయి. చివరకు యూపీ వారియర్స్‌ రూ.1.10 కోట్లకు సోఫీని దక్కించుకుంది. ఆ తర్వాత భారత్‌కు చెందిన హార్డ్‌ హిట్టర్‌ కిరణ్‌ నవ్‌గిరే (ఢిల్లీ-రూ.75లక్షలు)కు అత్యధిక మొత్తం లభించింది.


యువ కీపర్‌, బ్యాటర్‌ కమిలిని (రూ.40 లక్షలు)ని గుజరాత్‌ జెయింట్స్‌, ఆస్ట్రేలియాకు చెందిన జెస్‌ జొనాసెన్‌ (రూ.40 లక్షలు)ను ఆర్సీబీ, స్నేహ్‌ రాణా (రూ.30 లక్షలు)ను యూపీ వారియర్స్‌, ఐర్లాండ్‌ ఆల్‌రౌండర్‌ పెండెర్‌గాస్ట్‌ (రూ.30 లక్షలు)ను గుజరాత్‌, సుష్మా వర్మ (రూ.30లక్షలు)ను యూపీ వారియర్స్‌, ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ గ్రేస్‌ హ్యారిస్‌ (రూ. 30లక్షలు)ను యూపీ వారియర్స్‌, చోళ్‌ ట్రయన్‌ (రూ.30 లక్షలు)ను ఆర్సీబీ, తేజల్‌ హసబ్నిన్‌ (రూ.30లక్షలు)ను ఆర్సీబీ, ఆశా శోభన (రూ.30లక్షలు)ను యూపీ వారియర్స్‌, శ్వేత సెహ్రావత్‌ (రూ.20లక్షలు)ను ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకున్నాయి.


ఇవి కూడా చదవండి..

డబ్ల్యూబీబీఎల్‌: బ్రిస్బేన్ హీట్ జట్టులో భారత క్రికెటర్‌కు చోటు!

మళ్లీ టాప్‌నకు అభిషేక్‌

కాజల్‌, నీలమ్‌కు రజతాలు

Updated Date - Oct 29 , 2026 | 01:16 AM