మళ్లీ టాప్‌నకు అభిషేక్
ABN , Publish Date - Oct 29 , 2026 | 01:03 AM
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మళ్లీ నెం:1 ర్యాంక్‌ను కైవసం చేసుకొన్నాడు. బుధవారం విడుదల చేసిన ఐసీసీ టీ20 బ్యాటర్ల తాజా జాబితాలో శర్మ ఓ మెట్టెక్కి అగ్రస్థానానికి చేరుకోగా..
టీ20 ర్యాంకింగ్స్
దుబాయ్: టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మళ్లీ నెం:1 ర్యాంక్‌ను కైవసం చేసుకొన్నాడు. బుధవారం విడుదల చేసిన ఐసీసీ టీ20 బ్యాటర్ల తాజా జాబితాలో శర్మ ఓ మెట్టెక్కి అగ్రస్థానానికి చేరుకోగా.. గాయంతో గత రెండు మ్యాచ్‌లకు దూరమైన ఇషాన్ కిషన్ మూడో ర్యాంక్‌కు పడిపోయాడు. ఫర్హాన్ (పాకిస్థాన్) రెండో ర్యాంక్ దక్కించుకొన్నాడు. న్యూజిలాండ్‌తో మూడో టీ20లో అభిషేక్ శతకం బాదడంతో అతడి ర్యాంక్ మెరుగుపడింది.
కాగా, గత నాలుగేళ్లుగా టెస్ట్ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న రవీంద్ర జడేజా తన నెం:1 ర్యాంక్‌ను కోల్పోయాడు. మార్కో యాన్సెన్ (దక్షిణాఫ్రికా).. జడ్డూను వెనక్కినెట్టి టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకొన్నాడు. అంతేకాకుండా టెస్ట్ బౌలర్ల జాబితాలో కూడా యాన్సెన్ అగ్రస్థానాన్ని దక్కించుకోగా.. బుమ్రా ఐదో స్థానంలో ఉన్నాడు.
ఇవి కూడా చదవండి..
డబ్ల్యూబీబీఎల్: బ్రిస్బేన్ హీట్ జట్టులో భారత క్రికెటర్‌కు చోటు!
పారా ఆసియా క్రీడల చాంపియన్ నీరజ్ యాదవ్ ఆత్మహత్య