Share News

కాజల్‌, నీలమ్‌కు రజతాలు

ABN , Publish Date - Oct 29 , 2026 | 01:09 AM

ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణపోరుకు చేరి సంచలనం సృష్టించిన భారత యువ రెజ్లర్లు కాజల్‌ దోచక్‌, నీలమ్‌ సిరోహి రజత పతకాలతో సరిపెట్టుకున్నారు.

కాజల్‌, నీలమ్‌కు రజతాలు
Kajal Dochak, Neelam Sirohi

  • ప్రపంచ రెజ్లింగ్‌

అస్టానా (కజకిస్థాన్‌): ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణపోరుకు చేరి సంచలనం సృష్టించిన భారత యువ రెజ్లర్లు కాజల్‌ దోచక్‌, నీలమ్‌ సిరోహి రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. బుధవారం ఇక్కడ జరిగిన మహిళల 76 కిలోల విభాగం ఫైనల్‌ బౌట్‌లో కాజల్‌ 6-8తో అనస్తేసియా అల్పెయెవేయా (ఉక్రెయిన్‌) చేతిలో ఓడగా.. 50 కిలోల కేటగిరి తుది పోరులో జపాన్‌ దిగ్గజ రెజ్లర్‌ యుయి సుసాకి చేతిలో నీలమ్‌ ఓటమిపాలైంది. టోక్యో ఒలింపిక్స్‌ చాంపియన్‌ అయిన సుసాకి ఒక్క పాయింట్‌ కూడా కోల్పోకుండా ఫైనల్‌ బౌట్‌ నెగ్గడం విశేషం.


ఇవి కూడా చదవండి..

డబ్ల్యూబీబీఎల్‌: బ్రిస్బేన్ హీట్ జట్టులో భారత క్రికెటర్‌కు చోటు!

మళ్లీ టాప్‌నకు అభిషేక్‌

పారా ఆసియా క్రీడల చాంపియన్‌ నీరజ్‌ యాదవ్‌ ఆత్మహత్య

Updated Date - Oct 29 , 2026 | 01:09 AM