Share News

హ్యాట్రిక్‌పై హైదరాబాద్‌ గురి

ABN , Publish Date - Oct 26 , 2026 | 05:11 AM

వరుసగా రెండు విజయాలతో ఈ సీజన్‌ రంజీ ట్రోఫీని ఘనంగా ప్రారంభించిన హైదరాబాద్‌ జట్టులో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. ఈనేపథ్యంలో...

హ్యాట్రిక్‌పై హైదరాబాద్‌ గురి

నేటినుంచి పంజాబ్‌తో రంజీ మ్యాచ్‌

హైదరాబాద్‌: వరుసగా రెండు విజయాలతో ఈ సీజన్‌ రంజీ ట్రోఫీని ఘనంగా ప్రారంభించిన హైదరాబాద్‌ జట్టులో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. ఈనేపథ్యంలో సోమవారం నుంచి సికింద్రాబాద్‌ జింఖానా మైదానంలో పంజాబ్‌తో జరిగే గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌కు సిద్ధమైంది. తొలి మ్యా చ్‌లో 40 పరుగులతో త్రిపురపై నెగ్గిన హైదరాబాద్‌..రెండో పోరులో ఆంధ్రను 267 పరుగులతో చిత్తు చేసిన విషయం తెలిసిందే. అదే జోరును పంజాబ్‌పైనా కొనసాగించి విజయాల హ్యాట్రిక్‌ అందుకోవాలని హైదరాబాద్‌ (13 పాయింట్లు) భావిస్తోంది. తొలి రెండు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన సిరాజ్‌ న్యూజిలాండ్‌తో వన్డేలు, టెస్ట్‌ల్లో తలపడే భారత జట్టుకు ఎంపికయ్యాడు. దాంతో వైస్‌-కెప్టెన్‌ సీవీ మిలింద్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. మరోవైపు అసోంతో మొదటి మ్యాచ్‌ను డ్రా చేసిన పంజాబ్‌ (ఏడు పాయింట్లు)..రెండో పోరులో చత్తీస్‌గఢ్‌పై గెలుపొందింది. ఇక..మూలపాడులో జరిగే మరో గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో చత్తీస్‌గఢ్‌తో ఆంధ్ర తలపడుతుంది. కర్ణాటకతో జరిగిన తొలి మ్యాచ్‌ని ఆంధ్ర డ్రా చేసుకుంది.

ఈ వార్తలు కూడా చదవండి:

పెట్టుబడులకు రెట్టింపు లాభాలు

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

మీ-సేవలోడ్రైవింగ్‌ లైసెన్సు వీడియో!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 05:11 AM