'ప్లీజ్ వీడియో తీయొద్దు'.. అభిమానికి క్లాసెన్ స్వీట్ వార్నింగ్
ABN , Publish Date - May 01 , 2026 | 02:53 PM
ఐపీఎల్-2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాల్లో హెన్రిచ్ క్లాసెన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆదివారం నాటి పోరు కోసం క్లాసెన్ సన్నద్ధవుతున్నాడు. ఈ క్రమంలో క్లాసెన్ పేరిట ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్పోర్ట్స్ డెస్క్: సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అభిమానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. అనుమతి లేకుండా తన కుటుంబ సభ్యుల ఫొటోలు, వీడియోలు తీయడంపై క్లాసెన్ అసహనం వ్యక్తం చేశాడు. దయచేసి వీడియోలు తీయడం ఆపండి.. ఆపకపోతే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే, ఈ వీడియోలో క్లాసెన్ ముఖం మాత్రం కనిపించలేదు. అతడి వాయిస్, బిహేవియర్ బట్టి.. అతడు క్లాసెన్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఏప్రిల్ 29న ముంబై ఇండియన్స్‌పై 6 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో క్లాసెన్ అద్భుత ప్రదర్శన చేసి.. హైదరాబాద్ విజయంలో కీలత పాత్ర పోషించాడు. ఇక మ్యాచ్ అనంతరం సన్ రైజర్స్ ఆటగాళ్లు హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో హెన్రిచ్ క్లాసెన్‌తో ఓ అభిమాని మాట్లాడుతూ.. ‘మీరు చాలా బాగా ఆడారు సార్’ అని అన్నాడు.
అభిమాని ప్రశంసలకు స్పందించిన క్లాసెన్ ‘థాంక్యూ వెరీ మచ్ సర్. అయితే, మీరు దయచేసి ఫొటోలు, వీడియోలు తీయొద్దు. నేను అటు ఇటు తిరిగే సమయంలో నాకు తెలియకుండా నా ఫ్యామిలీ ఫొటోలు తీస్తారు. దయచేసి అలా చేయొద్దు. ఒకవేళ అలా ఫొటోలు తీస్తే మిమ్మల్ని కచ్చితంగా కొడతాను’ అని అభిమానికి క్లాసెన్ స్వీట్ వార్నింగ్స్ ఇచ్చాడు. దీనిపై క్లాసెన్‌కు అభిమానులు మద్దతుగా నిలిచారు. ప్రైవసీకి భంగం కలిగించొద్దని సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి:
రజత్ పాటిదార్ ఔట్ వివాదం.. స్పందించిన జేసన్ హోల్డర్
మహిళలు స్నానం చేస్తుండగా వీడియో.. శ్రీలంక క్రికెటర్ల అరెస్ట్!