ఆ విషయంలో పాకిస్థాన్ క్రికెట్‌ను నమ్మోచ్చు: హర్షా భోగ్లే
ABN , Publish Date - Sep 01 , 2026 | 04:25 PM
మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో పాకిస్థాన్ ఘోరంగా ఓడింది. ఇక సిరీస్‌లో ఆఖరిదైన మూడో మ్యాచ్ ముందే ఆ జట్టులో భారీ మార్పులు జరిగాయి.
స్పోర్ట్స్ డెస్క్: మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో పాకిస్థాన్ జట్టు ఘోరంగా ఓడింది. ఇక సిరీస్‌లో ఆఖరిదైన మూడో మ్యాచ్ ముందే ఆ జట్టులో భారీ మార్పులు జరిగాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించింది. వారి స్థానంలో కొత్త ప్లేయర్లను ప్రకటించింది. ఒక సిరీస్ మధ్యలో జట్టులో ఒకేసారి ఇన్ని మార్పులు చేయడం అరుదు. ఇక ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్‌లో జరుగుతున్న పరిణామాలపై ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే వ్యంగ్యంగా స్పందించాడు. విచిత్రమైన నిర్ణయాలు తీసుకోవడంలో పాకిస్థాన్‌ను నమ్మొచ్చంటూ సైటర్లు వేశాడు.
'నమ్మశక్యం కానీ, విచిత్రమైన నిర్ణయాలు తీసుకోవడంలో పాకిస్థాన్ క్రికెట్‌ను నమ్మోచ్చు. మొదటి టెస్టుకు కెప్టెన్‌గా ఉన్న సల్మాన్ అఘాను రెండో టెస్టు నుంచి తప్పించారు. ఈ టెస్టు ఓడిపోవడంతో ఏకంగా అతడిని జట్టు నుంచి తప్పించి ఇంటికి పంపించారు. అలానే సిరీస్ మధ్యలోనే కోచ్, బౌలింగ్ కోచ్‌లను తొలగించారు. సీనియర్ కీపర్‌ను ఇంటికి పంపిం చేశారు. వారి స్థానంలో వచ్చిన ఆటగాళ్లు టెస్ట్ మ్యాచ్‌కు సిద్ధమవడం అటుంచి, సమయానికి వీసాలు రావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి తప్పుడు నిర్ణయాలతోనే పాకిస్థాన్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది' అని హర్షా భోగ్లే ఎక్స్‌లో రాసుకొచ్చాడు.
తొలి రెండు టెస్టుల్లో ఆ జట్టు ఘోర పరాజయం పాలవడంతో.. మూడో మ్యాచ్‌కు పాకిస్థాన్ జట్టులో భారీ మార్పులు చేసింది. ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించింది. వారి స్థానంలో కొత్త ప్లేయర్లను ప్రకటించింది. మహ్మద్ రిజ్వాన్, ఇమాముల్ హక్, సల్మాన్ ఆఘా, అలీ ఉస్మాన్, ఆమిర్ జమాల్, మహ్మద్ అవైస్, ఖుర్రమ్ షెజాద్ జట్టులో చోటు కోల్పోయారు. వారి స్థానాల్లో సయీమ్ ఆయూబ్, అబ్దుల్లా ఫజల్, అరాఫత్ మిన్హాస్, సాద్ బైగ్, మహ్మద్ రంధావా, రజావుల్లా, మహ్మద్ ఇమ్రాన్ జూనియర్ ఆటగాళ్లు అవకాశం దక్కించుకున్నారు. ప్రధాన కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌లపై కూడా వేటు పడింది. వారి స్థానంలో మైక్ హెసన్, ఆష్లీ నాఫ్కె బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇవి కూడా చదవండి:
ఇరాన్ యుద్ధంతో అమెరికా ఆయుధ నిల్వలు ఖాళీ.. ఒకవేళ చైనాతో యుద్ధం మొదలైతే..
వానరాల దాహం తీర్చిన వెలిగొండ ఫీడర్ కెనాల్.. ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్