ఇరాన్ యుద్ధంతో అమెరికా ఆయుధ నిల్వలు ఖాళీ.. ఒకవేళ చైనాతో యుద్ధం మొదలైతే..
ABN , Publish Date - Sep 01 , 2026 | 04:22 PM
ఇరాన్‌తో అమెరికా కొనసాగిస్తున్న యుద్ధం ఇప్పుడు మరో కీలక సమస్యను తెరపైకి తెచ్చింది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకునేందుకు అమెరికా భారీగా మిసైళ్లు, ఎయిర్ డిఫెన్స్ ఇంటర్‌సెప్టర్లను వినియోగించడంతో కీలక ఆయుధ నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌తో అమెరికా కొనసాగిస్తున్న యుద్ధం ఇప్పుడు మరో కీలక సమస్యను తెరపైకి తెచ్చింది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకునేందుకు అమెరికా భారీగా మిసైళ్లు, ఎయిర్ డిఫెన్స్ ఇంటర్‌సెప్టర్లను వినియోగించడంతో కీలక ఆయుధ నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్ల నిల్వలు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 65 శాతం తగ్గిపోయినట్టు అమెరికా మీడియాలో వార్తలు వస్తున్నాయి (US missile stockpile).
ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణులు, డ్రోన్లను అడ్డుకునేందుకు అమెరికా సైన్యం కొన్నిసార్లు ఒకే లక్ష్యంపై రెండు లేదా మూడు ఇంటర్‌సెప్టర్లను ప్రయోగిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ నుంచి వస్తున్న ఒక్కో క్షిపణిని కూల్చేందుకు అమెరికా రెండు, మూడు ఇంటర్‌సెప్టర్లను వినియోగిస్తోంది. దాదాపు 1,500 పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్లు ఇప్పటికే వినియోగించేశారు. యుద్ధానికి ముందు అమెరికా వద్ద సుమారు 2,330 పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్లు ఉండగా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 850 కంటే తక్కువ మాత్రమే మిగిలాయి (US Patriot interceptor shortage).
జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ వంటి అమెరికా మిత్రదేశాలు కొన్ని కీలక ఆయుధ వ్యవస్థల కోసం అమెరికా సరఫరాలపై ఆధారపడుతున్నాయి. ఒకవేళ తైవాన్ విషయంలో చైనాతో అమెరికాకు ఘర్షణ మొదలైతే సమస్య తీవ్రంగా ఉంటుంది. అప్పటికి తమ వద్ద తగినంత ఆయుధాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు ఉంటాయా అమెరికా సైనిక వ్యూహకర్తలు ఆందోళన చెందుతున్నారు. చైనా ఇప్పటికే తైవాన్ చుట్టూ సైనిక కార్యకలాపాలను పెంచుతోంది. 2027 నాటికి తైవాన్‌పై సైనిక చర్యకు సిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తమ సైన్యాన్ని ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి (China Taiwan conflict).
ఒకవేళ తైవాన్‌పై చైనా దండెత్తితే అమెరికా జోక్యం చేసుకునే స్థితిలో ఉండదని యుద్ధ నిపుణులు భావిస్తున్నారు (US China war threat). మరోవైపు తైవాన్‌కు అమెరికా ఇవ్వాల్సిన 30 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు ఇంకా డెలివరీ కాలేదు. అందులో 882 మిలియన్ డాలర్ల విలువైన పేట్రియాట్ మిసైళ్లు కూడా ఉన్నాయి. ప్రస్తుత స్థితిలో తైవాన్ కోసం చైనాను ఎదురించే స్థితలో అమెరికా లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, అమెరికా తన ఆయుధాలను ఇరాన్ యుద్ధం కోసం ఇతర ప్రాంతాల నుంచి మళ్లిస్తుండటంతో యూరప్‌లోని అమెరికా, నాటో బలగాలపై కూడా ప్రభావం పడుతోంది.
ఇవి కూడా చదవండి
క్రికెట్‌లో కోహ్లీనే మెస్సి, రొనాల్డో.. థాయ్ ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో వైరల్
పోలవరం నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. చంద్రబాబు చేతుల మీదుగా విడుదల