Share News

మెస్సి ఆస్తి ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే!

ABN , Publish Date - Sep 01 , 2026 | 03:41 PM

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. అతడు ఫుట్‌బాల్‌లో సాధించిన విజయాలతో పాటు, తన కెరీర్‌లో సంపాదించిన భారీ ఆదాయంతో.. ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రీడాకారుల్లో ఒకరిగా నిలిచాడు.

మెస్సి ఆస్తి ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే!
Lionel Messi net worth

స్పోర్ట్స్ డెస్క్: అర్జెంటీనా స్టార్, లెజండరీ ప్లేయర్ లియోనెల్ మెస్సి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని నిన్న(సోమవారం) తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ భావోద్వేగ లేఖ ద్వారా వెల్లడించాడు. మెస్సి రిటైర్‌మెంట్ ప్రకటించినప్పటికీ ఇంటర్ మయామి క్లబ్ తరఫున ఫుట్‌బాల్ ఆటను కొనసాగిస్తున్నాడు. ఇక మెస్సి రిటైర్‌మెంట్ నేపథ్యంలో అతడి ఆస్తుల గురించి చర్చ జరుగుతోంది. మరి.. మెస్సి ఆస్తులు ఎంత ఉన్నాయి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...


21 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో లియోనెల్ మెస్సి కళ్లు చెదిరే రీతిలో ఆస్తులు సంపాదించాడని తెలుస్తోంది. తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న మెస్సి.. ఫుట్‌బాల్ టీమ్ కాంట్రాక్ట్స్, వాణిజ్య ప్రకటనలు, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వంటి వివిధ మార్గాల్లో కోట్ల రూపాయలు ఆర్జించాడు. ప్రస్తుతం అతడు ఏడాదికి 140 మిలియన్ డాలర్లు ఆర్జిస్తున్నట్లు సమాచారం


ఫోర్బ్స్ అంచనా ప్రకారం లియోనెల్ మెస్సి నెట్ వర్త్ 1.1 బిలియన్ డాలర్లు. దాని విలువ భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.10,590 కోట్లు ఉంటుంది. బార్సిలోనా క్లబ్ నుంచి మొదలైన మెస్సి ఆర్థిక ప్రస్థానం పారిస్ సెయింట్ జర్మైన్, ఇంటర్ మియామీ అగ్రిమెంట్స్ ద్వారా భారీగా చేరింది. అలానే సోషల్ మీడియాలో కోట్లాది మంది అభిమానులు ఉండటంతో.. మెస్సి ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ ద్వారా ఒక్కో పోస్ట్‌కు సుమారు 2.7 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

అర్జెంటీనా జెర్సీ కళ తప్పుతుంది.. మెస్సి రిటైర్‌మెంట్‌పై భావోద్వేగ సందేశాలు

అఫ్గాన్ సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్.. మళ్లీ గాయపడ్డ హార్దిక్ పాండ్య!

Updated Date - Sep 01 , 2026 | 03:55 PM