వానరాల దాహం తీర్చిన వెలిగొండ ఫీడర్ కెనాల్.. ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్
ABN , Publish Date - Sep 01 , 2026 | 04:14 PM
వెలిగొండ ప్రాజెక్ట్ నీటి ప్రవాహంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ‘ఎక్స్’లో ఆసక్తికర పోస్ట్ చేశారు. వెలిగొండ ఫీడర్ కెనాల్‌లో ప్రవహిస్తున్న నీటిని వానరాలు తాగుతూ దాహం తీర్చుకుంటున్న దృశ్యాన్ని సీఎం ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
అమరావతి, సెప్టెంబర్ 1: వెలిగొండ ప్రాజెక్ట్ నీటి ప్రవాహంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ‘ఎక్స్’లో ఆసక్తికర పోస్ట్ చేశారు. వెలిగొండ ఫీడర్ కెనాల్‌లో ప్రవహిస్తున్న నీటిని వానరాలు తాగుతూ దాహం తీర్చుకుంటున్న దృశ్యాన్ని సీఎం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘జలంతోనే.. జీవం, జీవితం’ అంటూ ఈ వీడియోకు స్పందించారు. వెలిగొండ జలాలు కరవు ప్రాంతాలకు చేరడంతో ప్రజల తాగునీటి అవసరాలతో పాటు మూగజీవాలకు కూడా దాహార్తిని తీర్చడంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు.
కాగా, నిన్న(సోమవారం) వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1ను సీఎం చంద్రబాబు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మార్కాపురం జిల్లా గంటవానిపల్లి సమీపంలో వెలిగొండ ఫీడల్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు చీర, సారెను సమర్పించిన సీఎం... జలహారతి ఇచ్చారు. అనంతరం ప్రాజెక్ట్ పైలాన్‌ను ఆవిష్కరించారు. స్థానిక రైతులతో బటన్ నొక్కించి నల్లమలసాగర్‌కు నీటిని విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్‌తో ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని కరవు ప్రాంతాలకు కొత్త జీవం రానుంది. ఫేజ్-1 ద్వారా సుమారు 1.19 లక్షల ఎకరాల సాగునీరు, 4 లక్షల జనాభాకు తాగునీటిని అందించనున్నారు.
ఇవి కూడా చదవండి..
మూడు పోలవరాలు కట్టేంత మొత్తాన్ని పెన్షన్లకు ఖర్చు చేశాం: సీఎం చంద్రబాబు
కర్నూలులో ఉగ్ర కలకలం.. నూర్ మహమ్మద్ అరెస్ట్
Read Latest AP News And Telugu News