Share News

కర్నూలులో అనుమానిత ఉగ్రవాది అరెస్ట్

ABN , Publish Date - Sep 01 , 2026 | 03:48 PM

కర్నూలు జిల్లాలో ఉగ్ర కలకలం రేపింది. నూర్ మహమ్మద్‌ అనే అనుమానిత ఉగ్రవాదిని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం ఉగ్రవాదిని ప్రత్యేక భద్రత మధ్య హైదరాబాద్‌కు తరలించారు.

కర్నూలులో అనుమానిత ఉగ్రవాది అరెస్ట్
Kurnool terror news

కర్నూలు, సెప్టెంబర్ 1: జిల్లాలో ఉగ్ర కలకలం రేగింది. నూర్ మహమ్మద్‌ అనే అనుమానిత ఉగ్రవాదిని ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం అతడిని ప్రత్యేక భద్రత మధ్య హైదరాబాద్‌కు తరలించారు. మహమ్మద్‌ను అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్‌కు చెందిన నూర్ మహమ్మద్.. కర్నూలు నగర శివారులోని గొందిపర్ల గ్రామంలో ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అతడిపై నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ పోలీసులు.. ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.


మహమ్మద్‌‌కు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, అతడి కార్యకలాపాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. మహమ్మద్‌కు ఏ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయనే అంశంపైనా దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కర్నూలు శివారులోని గొందిపర్ల ప్రాంతంలో పరిశ్రమలో పనిచేస్తున్న వ్యక్తిని ఐబీ అధికారులు అరెస్ట్ చేయడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.


ఇవి కూడా చదవండి..

పోలవరం నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. చంద్రబాబు చేతుల మీదుగా విడుదల

మూడు పోలవరాలు కట్టేంత మొత్తాన్ని పెన్షన్లకు ఖర్చు చేశాం: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 01 , 2026 | 04:39 PM