Share News

పంజాబ్ జట్టులోకి పాండ్యా.. ఫస్ట్ రియాక్షన్ ఇదే!

ABN , Publish Date - Nov 11 , 2026 | 01:55 PM

ఐపీఎల్ ట్రేడింగ్ విండోలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి సేవలందిస్తూ వచ్చిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఇకపై పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు.

 పంజాబ్ జట్టులోకి పాండ్యా.. ఫస్ట్ రియాక్షన్ ఇదే!
Hardik Pandya

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ (IPL) ట్రేడింగ్ విండోలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ముంబై ఇండియన్స్ (MI) ఫ్రాంచైజీకి సేవలందిస్తూ వచ్చిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఇకపై పంజాబ్ కింగ్స్ (PBKS) తరఫున బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత కీలకమైన ప్లేయర్ ట్రేడింగ్ ప్రక్రియలో భాగంగా ఈ భారీ మార్పు చోటుచేసుకుంది. పంజాబ్ జట్టులోకి మారిన తర్వాత పాండ్యా.. శ్రేయస్ అయ్యర్‌కు గట్టి సందేశం పంపాడు.


పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో, దిగ్గజ కోచ్ రికీ పాంటింగ్ పర్యవేక్షణలో ఆడేందుకు హార్దిక్ తీవ్ర ఉత్సాహం కనబరుస్తున్నాడు. శ్రేయస్ నాయకత్వంలోని పంజాబ్ జట్టుకు తనవంతుగా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని పాండ్యా వెల్లడించాడు. హార్దిక్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. 'సత్ శ్రీ అకాల్, నా కెప్టెన్ శ్రేయస్, నా కోచ్ రికీ, నా జట్టు.. పంజాబీ ప్రజలరా!. మీ వెనుక నేను నిలబడతాను' అంటూ తన భావోద్వేగాన్ని పంచుకున్నాడు.


తాజా ట్రేడింగ్‌తో ముంబై ఇండియన్స్‌తో హార్దిక్ పాండ్యా రెండో విడత ప్రయాణానికి తెరపడింది. 2015లో ముంబై జట్టులో అడుగుపెట్టిన హార్దిక్.. అప్పట్లో అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 2015, 2017, 2019, 2020లో ఆ జట్టు టైటిల్స్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు సరికొత్త సవాల్‌తో పంజాబ్ కింగ్స్ శిబిరంలో అడుగుపెడుతున్న హార్దిక్ పాండ్యా రాకతో ఆ జట్టు మరింత పటిష్ఠంగా మారనుంది.


పాండ్యాకు కృతజ్ఞతలు తెలిపిన ముంబై

ఇవాళ(బుధవారం) జరిగిన భారీ ట్రేడ్ డీల్ పై ముంబై జట్టు స్పందించింది. సుదీర్ఘకాలం పాటు తమ ఫ్రాంచైజీలో కొనసాగిన పాండ్యాకు వీడ్కోలు చెబుతూ ఓ వీడియో షేర్ చేసింది. 'ఎత్తుపల్లాలతో సాగిన ఈ ప్రయాణంలో.. ప్రతి దశలోనూ ముంబై కథలో నువ్వు భాగమయ్యావు. థ్యాంక్యూ హర్దిక్' అని ఫ్రాంచైజీ రాసుకొచ్చింది.


ఇవి కూడా చదవండి:

టీమిండియా మాజీ వికెట్ కీపర్ కేఎస్ భరత్ సంచలన నిర్ణయం!

ఐపీఎల్ 2027లో భారీ ట్రేడ్ డీల్.. ముంబైకి అర్ష్‌దీప్, పంజాబ్‌కు పాండ్యా!

కేరళం జట్టుకు కెప్టెన్‌గా సంజూ శాంసన్ ఎంపిక..

47 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. మరో లీగ్‌లోకి గేల్ రీఎంట్రీ!

Updated Date - Nov 11 , 2026 | 02:01 PM