Share News

SL vs IND: నిలకడగా ఆడుతున్న భారత్.. శతకం మెరిసిన పడిక్కల్

ABN , Publish Date - Aug 15 , 2026 | 05:09 PM

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వన్ డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ సెంచరీతో మెరిశాడు. టెస్టుల్లో పడిక్కల్‌కు ఇది తొలి శతకం.

SL vs IND: నిలకడగా ఆడుతున్న భారత్.. శతకం మెరిసిన పడిక్కల్
Devdutt Padikkal

స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వన్ డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ సెంచరీతో మెరిశాడు. టెస్టుల్లో పడిక్కల్‌కు ఇది తొలి శతకం. గాలే వేదికగా శనివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇది భారత క్రికెట్ చరిత్రలో 600వ టెస్టు కావడం విశేషం. ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే...


తొలి సెషన్‌లోనే భారత్ 101/1తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. యశస్వి జైస్వాల్ 32 పరుగుల వద్ద రనౌట్‌గా వెనుదిరిగినప్పటికీ.. కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. టీ విరామ సమయానికి భారత్ 197/1తో ఆధిపత్యం ప్రదర్శించింది. రాహుల్, పడిక్కల్ అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. మూడో సెషన్‌ ఆట ప్రారంభంకాబోతుండగా.. కేఎల్ రాహుల్ (77; 162 బంతుల్లో) రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌కు దిగాడు.


గిల్, పడిక్కల్ కూడా నిలకడగా ఆడారు. 134 బంతుల్లో పడిక్కల్ శతకం పూర్తి చేసుకున్నాడు. 61.5 ఓవర్లో ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గిల్ ఔటయ్యాడు. జయసూర్య బౌలింగ్‌లో లాహిరుకు క్యాచ్ ఇచ్చిన గిల్ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం రిషబ్ పంత్ 3 పరుగులు, దేవదత్ 107 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం 63 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్ 239/2 గా ఉంది. తొలి రోజు ఆటలో భారత బ్యాటర్లు శ్రీలంక బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్‌కు ప్రత్యేకత ఉంది.


స్వాతంత్ర్య దినోత్సవం రోజున భారత్ ఆడుతున్న చారిత్రాత్మక 600వ టెస్టుకు అతడు నాయకత్వం వహిస్తున్నాడు. జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడంతో మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలతో భారత్ బరిలోకి దిగింది. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్‌లతో ముగ్గురు స్పిన్నర్లను కూడా తుది జట్టులోకి తీసుకుంది.


ఇవి కూడా చదవండి:

ఆస్ట్రేలియా రికార్డును బద్దలు కొట్టిన స్పెయిన్

క్రికెట్ చరిత్రలో సంచలనం.. అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డ్‌

Updated Date - Aug 15 , 2026 | 05:35 PM