'ఒక్క ట్వీట్‌తో హోర్ముజ్‌ను స్వాధీనం చేసుకోలేరు'.. ట్రంప్ వ్యాఖ్యపై ఇరాన్
ABN , Publish Date - Aug 15 , 2026 | 04:44 PM
హోర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తానంటూ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ మండిపడింది. ట్వీట్లు లేదా సైనిక శక్తి ద్వారా హోర్ముజ్ జలసంధిని సొంతం చేసుకోవడం సాధ్యం కాదని, ఆ జలసంధి ఎప్పటికీ ఇరాన్ పరిధిలోనే ఉంటుందని పేర్కొంది.
ఆంధ్రజ్యోతి, ఆగస్టు 15: హోర్ముజ్ జలసంధిపై అమెరికా-ఇరాన్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని అమెరికా భూభాగంగా ప్రకటిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ట్వీట్లు లేదా సైనిక శక్తి ద్వారా హోర్ముజ్ జలసంధిని సొంతం చేసుకోవడం సాధ్యం కాదని, ఆ జలసంధి ఎప్పటికీ ఇరాన్ పరిధిలోనే ఉంటుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కాజెమ్ ఘరీబాబాది స్పష్టం చేశారు.
ట్రంప్ వ్యాఖ్యలు.. ఇరాన్ ఘాటు కౌంటర్!
డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు: న్యూయార్క్‌లోని ఓ కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్, 'ఇరాన్‌ను ఓడించిన వెంటనే హార్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తాను' అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఈ జలసంధిపై అమెరికాకు సంపూర్ణ నియంత్రణ ఉందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
ఇరాన్ కౌంటర్: 'హోర్ముజ్ జలసంధి గతంలోనూ, ఇప్పుడు, ఎప్పటికీ ఇరాన్ సొంతమే' అని ఘరీబాబాది తేల్చి చెప్పారు. ట్వీట్ల ద్వారా లేదా నౌకాదళ నౌకల బెదిరింపులతో దీనిని ఆక్రమించడం కుదరదని, తమ అనుమతి లేకుండా ఏ వాణిజ్య నౌక కూడా ఈ జలసంధి ద్వారా ప్రయాణించలేదని ఇరాన్ మిలిటరీ స్పష్టం చేసింది.
వైట్ హౌస్ వివరణ: ట్రంప్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపడంతో, ఆయన ఆ వ్యాఖ్యలను సరదాగా (జోక్‌గా) అన్నారని ఒక ఉన్నతాధికారి వెల్లడించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
ఇవి కూడా చదవండి...
అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు
Read Latest AP News And Telugu News