Share News

సీఎస్కే కోచ్‌గా ఆ స్టార్ ప్లేయర్లు వద్దు: క్రిష్ శ్రీకాంత్

ABN , Publish Date - Aug 17 , 2026 | 07:43 AM

చెన్నై సూపర్‌ కింగ్స్‌‌కు 18 ఏళ్లపాటు కోచ్‌గా ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇటీవల ఆ బంధానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీఎస్కేకు కొత్త హెడ్‌గా ఎవరొస్తారనే దానిపై క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో..

సీఎస్కే కోచ్‌గా ఆ స్టార్ ప్లేయర్లు వద్దు: క్రిష్ శ్రీకాంత్
CSK new head coach

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కీలక మార్పులకు సిద్ధమైంది. ఇటీవలే 18 సీజన్ల పాటు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ (Stephen Fleming) ఆ బాధ్యతల నుంచి వైదొలగాడు. దీంతో సీఎస్కే కొత్త కోచ్ ఎంపికపై ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ను 2019 వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిపిన మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, అలాగే న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.


సీఎస్కే హెడ్ కోచ్ అంశంపై ఇటీవల భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. ఇయాన్ మోర్గాన్ కొత్త హెడ్ కోచ్ రేసులో ఉన్నారని, దీనిపై ఇప్పటికే అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయని తెలిపాడు. అయితే తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్, సీఎస్కే మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth) ఈ వాదనను తీవ్రంగా వ్యతిరేకించాడు.


తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడుతూ.. మోర్గాన్ గొప్ప ప్లేయరే అయినప్పటికీ, కోచ్‌గా అతడ్ని తాను అంగీకరించబోనని స్పష్టం చేశాడు. కేకేఆర్ (KKR) కెప్టెన్‌గా మోర్గాన్ ప్రత్యేకించి ఏమీ సాధించలేదని, అతడు కేవలం కామెంటరీకే పరిమితం కావడం మంచిదని అభిప్రాయపడ్డాడు. ఇదే సమయంలో బ్రెండన్ మెకల్లమ్ నియామకాన్ని కూడా క్రిష్ వ్యతిరేకించాడు.


బయటి వ్యక్తుల కోసం వెతకడానికి బదులుగా, సీఎస్కేను పూర్తిగా అర్థం చేసుకున్న 'మిస్టర్ క్రికెట్' మైకేల్ హస్సీ (Michael Hussey) అయితేనే సరైన హెడ్ కోచ్ అవుతారని శ్రీకాంత్ సూచించాడు. ఇప్పటికే హస్సీ సీఎస్కే జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా సేవలు అందించిన అనుభవం ఉండటంతో, అతడ్ని నేరుగా ఎంపిక చేయాలని క్రిష్ అభిప్రాయపడ్డాడు.


ఇవి కూడా చదవండి:

పటిష్ట స్థితిలో..

చరిత్రవైపు సింధు చూపు

Updated Date - Aug 17 , 2026 | 07:46 AM