పటిష్ట స్థితిలో..
ABN , Publish Date - Aug 17 , 2026 | 05:54 AM
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో రెండోరోజు ఆటకు వరుణుడు అడ్డుపడ్డాడు. దీంతో ఉదయం సెషన్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోగా.. 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అయితే ఈసారి...
భారత్ తొలి ఇన్నింగ్స్ 460/9
జురెల్ అర్ధసెంచరీ జూప్రభాత్‌కు నాలుగు వికెట్లు
వర్షంతో ఆటంకం జూశ్రీలంకతో మొదటి టెస్టు
గాలె: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో రెండోరోజు ఆటకు వరుణుడు అడ్డుపడ్డాడు. దీంతో ఉదయం సెషన్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోగా.. 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అయితే ఈసారి లంక స్పిన్నర్లు మెరుగ్గానే రాణించగా, భారత్ సైతం విలువైన పరుగులు రాబట్టింది. శతక వీరుడు దేవ్‌దత్ పడిక్కళ్ (167), కేఎల్ రాహుల్ (82) తమ జోరు కొనసాగించగా.. ధ్రువ్ జురెల్ (51) అర్ధసెంచరీతో అదరగొట్టాడు. ఫలితంగా ఆదివారం ఆట ముగిసేసరికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 460 పరుగుల భారీస్కోరు సాధించింది. క్రీజులో కుల్దీప్ (12) ప్రసిద్ధ్ కృష్ణ (1) ఉన్నారు. స్పిన్నర్లు ప్రభాత్ జయసూర్యకు 4, కేశర నువంతకు 3 వికెట్లు దక్కాయి.
వర్షం దోబూచులాట: ఆదివారం ఉదయం నుంచే గాలెలో భారీవర్షంతో మైదానం చిత్తడిగా మారింది. అయితే వర్షం తెరిపినిచ్చి మైదానం సిద్ధం చేసేలోపే పలుమార్లు వరుణుడు మళ్లీ అడ్డుపడ్డాడు. దీంతో తొలి సెషన్ ఆట వీలు పడలేదు. ఎట్టకేలకు మధ్యాహ్నం 2.35కు రెండో సెషన్ మొదలవగా.. ఈసారి లంక స్పిన్నర్లు కట్టడి చేయడంతో పంత్ (39), రాహుల్, పడిక్కళ్ పెవిలియన్ చేరారు. చివరి సెషన్‌లో జురెల్ దీటుగా ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొని ఏడో వికెట్‌కు మానవ్ సుతార్ (24)తో కలిసి 55 పరుగులు జోడించడంతో స్కోరు 450 దాటింది.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (రనౌట్) 32, రాహుల్ (సి) నిషాన్ (బి) కేశర 82, దేవ్‌దత్ (స్టంప్) డిక్‌వెల్లా (బి) ప్రభాత్ 167, గిల్ (సి) ఉడార (బి) ప్రభాత్ 16, పంత్ (సి) సోనాల్ (బి) కేశర 39, జురెల్ (సి) ధనంజయ (బి) ప్రభాత్ 51, జడేజా (ఎల్బీ) కేశర 13, మానవ్ (సి) ఉడార (బి) ప్రభాత్ 24, సిరాజ్ (సి) ధనంజయ (బి) అసిత 11, కుల్దీప్ (బ్యాటింగ్) 12, ప్రసిద్ధ్ (బ్యాటింగ్) 1; ఎక్స్‌ట్రాలు: 12, మొత్తం: 116 ఓవర్లలో 460/9. వికెట్ల పతనం: 1-47, 2-236, 3-307, 4-319, 5-357, 6-377, 7-432, 8-447, 9-447. బౌలింగ్: అసిత ఫెర్నాండో 17-1-61-1, లాహిరు కుమార 13-1- 76-0, కేశర నువంత 39-1-175-3, ప్రభాత్ జయసూర్య 39-6-109-4, ధనంజయ డి సిల్వ 4-0-15-0, సోనాల్ దినుష 4-0-17-0.
ఇవి కూడా చదవండి:
ఆస్ట్రేలియాపై గెలుపు .. స్పందించిన బంగ్లా కెప్టెన్ నజ్ముల్
సిన్సినాటి ఓపెన్‌లో జకోవిచ్‌కు షాక్