Share News

సిన్సినాటి ఓపెన్‌లో జకోవిచ్‌కు షాక్‌

ABN , Publish Date - Aug 16 , 2026 | 02:10 PM

టెన్నిస్ స్టార్ ఆటగాడు జకోవిచ్‌కు సిన్సినాటి ఓపెన్‌లో షాక్‌ తగిలింది. అర్జెంటీనా ఆటగాడు థియాగో టిరంటే చేతిలో జకోవిచ్‌ ఓటమి పాలయ్యాడు.

సిన్సినాటి ఓపెన్‌లో జకోవిచ్‌కు షాక్‌
Novak Djokovic

స్పోర్ట్స్ డెస్క్: సిన్సినాటి ఓపెన్‌లో టెన్నిస్ స్టార్ ఆటగాడు జకోవిచ్‌కు (Novak Djokovic) బిగ్ షాక్‌ తగిలింది. రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. అర్జెంటీనా ప్లేయర్‌ థియాగో టిరంటే చేతిలో ఓటమి పాలయ్యాడు. తొలి సెట్‌లో గెలిచిన జకోవిచ్.. ఆ తర్వాత రెండు సెట్లను కోల్పోయి పరాజయం చెందాడు. థియాగో టిరంటే 2-6, 6-4, 6-4 తేడాతో జకోవిచ్‌పై విజయం సాధించాడు. గత వింబుల్డన్‌ తర్వాత జకోవిచ్‌ తలపడిన మొదటి టోర్నీ ఇదే కావడం విశేషం.


మరోవైపు సిన్సినాటి ఓపెన్‌ సమయంలో జకోవిచ్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అక్కడి వాతావరణం కారణంగా అతడు వాంతులు కూడా చేసుకున్నాడని టెన్నిస్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం అమెరికాలో వేసవికాలం. దీంతో ఎండలు విపరీతంగా ఉన్నాయి. యూఎస్‌ ఓపెన్‌ సమయంలోనూ ఇదే వాతావరణ పరిస్థితులు ఉంటాయి. తీవ్ర పోటీ ఉండే గ్రాండ్‌స్లామ్‌ టైటిల్ గెలవాలంటే మాత్రం జకోవిచ్‌ తన ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాల్సిందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

వాళ్లు అద్భుతంగా ఆడారు: ప్యాట్ కమిన్స్

IND vs SL: సచిన్ సరసన యశస్వి జైస్వాల్

Updated Date - Aug 16 , 2026 | 02:21 PM