Share News

ముంబై నేవీ నగర్‌లో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురి అనుమానాస్పద మృతి

ABN , Publish Date - Aug 16 , 2026 | 01:33 PM

స్థానిక నేవీ నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. కొలాబాలో నౌక నావికుడి కుటుంబం అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. దంపతులు సహా ఇద్దరు పిల్లలు మరణించారు.

ముంబై నేవీ నగర్‌లో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురి అనుమానాస్పద మృతి

ముంబై, ఆగస్టు16: స్థానిక నేవీ నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. కొలాబాలో నౌక నావికుడి కుటుంబం అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. దంపతులు సహా ఇద్దరు పిల్లలు మరణించారు. కొన్ని రోజులుగా నావికుడి కుటుంబ సభ్యులు ఎవరూ బయటకు రాకపోవడంతో.. ఇరుగుపొరుగు వారు సందేహించారు. ఈ నేపథ్యంలో కిటికి తలుపు తీసి చూడగా.. వారంతా విగత జీవులుగా పడి ఉన్నారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.


పోలీసులు నేవీ నగర్‌లోని నావికుడి ఇంటికి చేరుకుని.. తలుపులు పగలగొట్టి.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నావికుడి కుటుంబ సభ్యుల మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారి మృతికి గల కారణాలపై పోలీసుల విచారిస్తున్నారు. నావికుడి కుటుంబ సభ్యుల మృతిపై బంధువులకు సమాచారం అందించారు. వారంతా అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరు అవుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

అటల్‌జీ సేవలు స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

రెచ్చిపోయిన మోడల్.. బట్టలు విప్పేసి రైల్వే అధికారులపై దాడి..

For More National News And Telugu News

Updated Date - Aug 16 , 2026 | 01:46 PM