Share News

పోరాడుతున్న భారత్‌-ఎ

ABN , Publish Date - Oct 26 , 2026 | 05:01 AM

దేవ్‌దత్‌ పడిక్కల్‌ (56 బ్యాటింగ్‌), సాయి సుదర్శన్‌ (39 బ్యాటింగ్‌) ఆదుకోవడంతో.. ఆతిథ్య న్యూజిలాండ్‌-ఎతో...

పోరాడుతున్న భారత్‌-ఎ

రెండో ఇన్నింగ్స్‌ 106/2 ఫ న్యూజిలాండ్‌-ఎ 317 ఆలౌట్‌

లింకన్‌ : దేవ్‌దత్‌ పడిక్కల్‌ (56 బ్యాటింగ్‌), సాయి సుదర్శన్‌ (39 బ్యాటింగ్‌) ఆదుకోవడంతో.. ఆతిథ్య న్యూజిలాండ్‌-ఎతో తొలి అనధికార టెస్ట్‌లో భారత్‌-ఎ పోరాడుతోంది. ఆదివారం ఆట ఆఖరుకు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 106/2 స్కోరు చేసింది. యశస్వి జైస్వాల్‌ (5), రాహుల్‌ (4) విఫలం కావడంతో భారత్‌ 10/2తో ఇబ్బందుల్లో పడింది. అయితే, పడిక్కల్‌, సుదర్శన్‌ మూడో వికెట్‌కు 96 పరుగులు జతచేర్చారు. కాగా, ఆటకు రెండో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 135/3తో తొలిఇన్నింగ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్‌-ఎ 317 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలిన భారత్‌-ఎ.. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంకా 98 పరుగులు వెనుకబడింది.

ఈ వార్తలు కూడా చదవండి:

పెట్టుబడులకు రెట్టింపు లాభాలు

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

మీ-సేవలోడ్రైవింగ్‌ లైసెన్సు వీడియో!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 05:01 AM