Share News

భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రాహుల్ ద్రవిడ్ కుమారుడు

ABN , Publish Date - Jun 11 , 2026 | 04:47 PM

శ్రీలంక పర్యటనకు బీసీసీఐ అండర్‌-19 జట్టును ప్రకటించింది. ఈ జట్టులో టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్యయ్ ద్రవిడ్ ఎంపికయ్యాడు.

 భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రాహుల్ ద్రవిడ్ కుమారుడు
Anvay Dravid

స్పోర్ట్స్ డెస్క్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రవిడ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రియులను అలరించాడు. అలానే కోచ్ గా మారి.. భారత్‌కు పలు ఐసీసీ టోర్నీలు అందించాడు. తాజాగా మరో ద్రవిడ్ టీమిండియా జెర్సీని ధరించనున్నాడు. ద్రవిడ్ చిన్న కుమారుడైన వికెట్ కీపర్, బ్యాటర్ అన్వయ్ ద్రవిడ్‌కు భారత అండర్-19 జట్టులో చోటు దక్కింది. ఈ జట్టు వచ్చే నెలలో శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడనుంది


శ్రీలంక పర్యటనకు బీసీసీఐ అండర్‌19 జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు యశ్‌వర్దన్‌ సింగ్‌ చౌహాన్‌ సారథిగా వ్యవహరించనున్నాడు. కాగా జులై 4న ప్రారంభమయ్యే ఈ పర్యటనలో టీమిండియా-19 శ్రీ లంకతో వన్డే, ఫోర్‌ డే మ్యాచ్‌లు ఆడనుంది. వన్డే జట్టులోని ఇద్దరు వికెట్‌ కీపర్‌ బ్యాటర్లలో ఒకడిగా అన్వయ్‌కు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. గతేడాది నవంబరులో చివరగా అన్వయ్‌ ద్రవిడ్‌ భారత అండర్‌19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. స్వదేశంలో అఫ్గానిస్థాన్‌ అండర్‌19 జట్టుతో ఆడిన భారత్‌ ‘బి’ జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు. దేశీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌కు సెలక్టర్లు తాజాగా మరోసారి అవకాశం ఇచ్చారు.


భారత అండర్‌-19 వన్డే జట్టు

సాగర్ విర్క్, యశ్‌వర్ధన్ సింగ్ చౌహాన్ (కెప్టెన్‌), లక్ష్య రాయచందాని (వైస్‌ కెప్టెన్‌), వినీత్ వీకే, అర్జున్ రాజ్‌పుత్, కుషాగ్రా ఓజా, రజత్ బఘెల్ (వికెట్‌ కీపర్‌), అన్వయ్ ద్రవిడ్ (వికెట్‌ కీపర్‌), అన్మోల్జీత్ సింగ్, వూట్కూరి యశ్వీర్ గౌడ్, రోహిత్ అనిల్ యాదవ్, శవిన్‌ వి, కావ్యా పరేశ్‌ పటేల్‌, మోహిత్‌ ఉల్వా. ఇషాన్‌ సూద్‌.


అండర్ 19: భారత్, శ్రీలంక షెడ్యూల్‌

  • హంబన్‌టోటా వేదికగా మూడు వన్డేలు

  • 2026 జూలై 4, జూలై 6, జూలై 9 తేదీల్లో వన్డేలు

  • 2026 జూలై 13-16 మధ్య మొదటి యూత్‌ టెస్టు; వేదిక: గాలే

  • 2026జూలై 20-23 మధ్య రెండో యూత్‌ టెస్టు; వేదిక: కొలంబో


ఇవి కూడా చదవండి:

పీవీ సింధుకు కోచ్‌గా మారిన భర్త వెంకట దత్త సాయి

అదరగొట్టిన భారత బ్యాటర్లు.. అఫ్గాన్ ముందు భారీ టార్గెట్

Updated Date - Jun 11 , 2026 | 04:47 PM