Share News

జింబాబ్వేపై బంగ్లాదేశ్ ఘన విజయం

ABN , Publish Date - Jul 17 , 2026 | 08:55 PM

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ జరిగిన రెండో టీ20లో పర్యాటక జింబాబ్వేపై 34 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది.

జింబాబ్వేపై బంగ్లాదేశ్ ఘన విజయం
Bangladesh vs Zimbabwe

స్పోర్ట్స్ డెస్క్: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ (శుక్రవారం) జరిగిన రెండో టీ20లో పర్యాటక జింబాబ్వేపై 34 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో జింబాబ్వేపై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. తొలి టీ20లో జింబాబ్వే బంగ్లాకు షాకిచ్చిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో 32 పరుగుల తేడాతో జింబాబ్వే సంచలన విజయం నమోదు చేసింది.


రెండో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఓపెనర్లు సైఫ్‌ హస్సన్‌ (55), తంజిద్‌ హసన్‌ తమీమ్‌ (58) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆఖర్లో యాసిర్‌ అలీ (22 నాటౌట​్‌), సైఫుద్దీన్‌ (31 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. జింబాబ్వే బౌలర్లలో నగరవ, ఈవాన్స్‌ చెరో 2 వికెట్లు సాధించారు. అలానే స్టార్ ఆల్‌రౌండర్ సికందర్‌ రజా ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. అనంతరం ఓ 187 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే.. 19.4 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటైంది.


బంగ్లా బౌలర్లు రిషద్‌ హొస్సేన్‌ (4-26), మెహిది హసన్‌ (3-24) ధాటి​​ జింబాబ్వే బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. నహిద్‌ రాణా, సైఫుద్దీన్‌ , సైఫ్‌ హస్సన్‌ తలో వికెట్‌ తీశారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేకపోయారు. సికందర్‌ రజా (28), బ్రాడ్‌ ఈవాన్స్‌ (25), ర్యాన్‌ బర్ల్‌ (29) లు మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించారు. ఈ విజయంతో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. నిర్ణయాత్మక మూడో టీ20 జులై 19న(ఆదివారం) జరుగనుంది. కాగా, ఈ సిరీస్‌కు ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో, ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు జింబాబ్వే షాకిచ్చింది. వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మూడో టీ20 గెలిచి.. ఈ సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలనే కసితో జింబాబ్వే ఉంది.


ఇవి కూడా చదవండి:

ఫిఫా ప్రపంచ కప్ 2026: ఫైనల్ మ్యాచ్‌కు డొనాల్డ్ ట్రంప్

లార్డ్స్‌కు రోహిత్ శర్మ తల్లిదండ్రులు.. రిటైర్‌మెంట్ వార్తల వేళ కీలక పరిణామం!

Updated Date - Jul 17 , 2026 | 09:34 PM