Share News

అంతర్జాతీయ క్రికెట్‌కు అజింక్య రహానే గుడ్‌బై

ABN , Publish Date - Jul 30 , 2026 | 10:40 AM

భారత సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు అజింక్య రహానే  గుడ్‌బై
Ajinkya Rahane

స్పోర్ట్స్ డెస్క్: భారత సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ.. అభిమానులతో ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నాడు. 'సమయం వచ్చినప్పుడు దాన్ని గౌరవించి ముందుకు సాగాలి' అని తన అంతర్జాతీయ రిటైర్మెంట్ గురించి రహానే ప్రస్తావించాడు.


'జీవిత వాస్తవం ఏమిటంటే, ప్రతిదానికీ ఒక ప్రారంభం, ఒక ముగింపు ఉంటుంది. సమయం వచ్చినప్పుడు, దాన్ని గౌరవించి ముందుకు సాగాలి. నేను నా బ్యాటింగ్‌లో ఎల్లప్పుడూ సమయంపై ఆధారపడ్డాను. అలానే దాని ప్రాముఖ్యాన్ని ఎల్లప్పుడూ అర్థం చేసుకున్నాను. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది. చిన్న వయసులో కేవలం ప్రాక్టీస్ కోసం డోంబివ్లి నుంచి ప్రయాణించిన చివరకు ఈ ఆట కోసం నా సర్వస్వాన్ని అర్పించాను' అని రహానే పేర్కొన్నాడు. ఆటగాడిగా తన కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నప్పటికీ, తాను క్రికెట్‌కు మాత్రం సన్నిహితంగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపాడు.


ఆస్ట్రేలియాపై బోర్డర్-గావస్కర్ 2020-21ట్రోఫీని గెలిచిన టీమిండియాకు అజింక్య రహానే కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ సిరీస్ విజయంతో భారత క్రికెట్ చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు. రహానే తన కెరీర్ మొత్తంలో 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20ఐ మ్యాచ్‌లు ఆడాడు. ఈ 195 మ్యాచ్‌ల్లో రహానే 8,414 పరుగులు సాధించాడు. అందులో 5,077 పరుగులు టెస్ట్ క్రికెట్‌లో సాధించినవే కావడం గమనార్హం. అతడి పేరిట 12 టెస్టు సెంచరీలు ఉండగా.. అందులో 8 శతకాలు విదేశీ గడ్డపై చేసినవే కావడం విశేషం.


ఇవి కూడా చదవండి:

గుల్వీర్‌ చరిత్ర

పంచ్‌.. ‘సిక్సర్‌’

Updated Date - Jul 30 , 2026 | 11:32 AM