పంచ్.. ‘సిక్సర్’
ABN , Publish Date - Jul 30 , 2026 | 04:08 AM
అదిరే ప్రదర్శన చేస్తున్న భారత బాక్సర్లు.. మరో 6 పతకాలను ఖాయం చేశారు. జాస్మిన్ లంబోరియా, సాక్షి చౌదరి, అంకుశ్ పంగల్, అరుంధతి చౌదరి, సచిన్ సివాచ్, నరేందర్ బెర్‌వాల్ సెమీస్ చేరారు...
అదిరే ప్రదర్శన చేస్తున్న భారత బాక్సర్లు.. మరో 6 పతకాలను ఖాయం చేశారు. జాస్మిన్ లంబోరియా, సాక్షి చౌదరి, అంకుశ్ పంగల్, అరుంధతి చౌదరి, సచిన్ సివాచ్, నరేందర్ బెర్‌వాల్ సెమీస్ చేరారు. మహిళల 51 కిలోల క్వార్టర్స్‌లో సాక్షి 5-0తో కౌట్లిన్ ఫ్రయర్ (నార్థ్రన్ ఐర్లాండ్)ను, 70 కిలోల కేటగిరీలో అరుంధతి 3-1తో మోర్గాన్ హెండర్సన్ (న్యూజిలాండ్)ను, 57 కిలోల్లో జాస్మిన్ 4-1తో ఎలిస్ గ్లిన్ (ఇంగ్లండ్)ను ఓడించారు. పురుషుల 60 కిలోల విభాగం క్వార్టర్స్‌లో సచిన్ 5-0తో ట్రెజర్ మోర్మీ (బోట్సు వాన)పై, 80 కిలోల్లో అంకుశ్ 5-0తో జేడ్ (సీషెల్స్)పై, 90+ కిలోల్లో నరేందర్ 3-2తో మైకేల్ (సమోవా)పై నెగ్గారు. లవ్లీనా (75 కి), ప్రియ (60 కి), ప్రీతి (54 కి), జాదూమణి (55 కి) ఇప్పటికే సెమీస్ చేరడంతో భారత్‌కు మొత్తం 10 పతకాలు ఖరారయ్యాయి.
ఇవి కూడా చదవండి
విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ.. లోక్‌సభ ఆమోదంతో పేపర్ లీక్‌లకు చెక్: కేంద్ర మంత్రి అమిత్ షా