Share News

విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ.. లోక్‌సభ ఆమోదంతో పేపర్ లీక్‌లకు చెక్: కేంద్ర మంత్రి అమిత్ షా

ABN , Publish Date - Jul 29 , 2026 | 06:35 PM

దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల్లో పేపర్ లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లుకు ఆమోదం లభించగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ.. లోక్‌సభ ఆమోదంతో పేపర్ లీక్‌లకు చెక్: కేంద్ర మంత్రి అమిత్ షా
Competitive Exams, Exam Reforms

ఇంటర్నెట్ డెస్క్: దేశంలోని లక్షలాది మంది పరీక్షార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు-2026’కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ చట్టం ద్వారా పోటీ పరీక్షల్లో పారదర్శకత పెరుగుతుందని, పేపర్ లీకేజీలు, నకిలీ పరీక్షలు, ఇతర అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని ఆయన పేర్కొన్నారు. నిజాయతీగా శ్రమించే విద్యార్థుల భవిష్యత్తును రక్షించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.


ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘పరీక్షల నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవు. పేపర్ లీక్‌లు, మోసపూరిత కార్యకలాపాలు, పరీక్షల గోప్యతను భంగం చేసే వారిపై కఠిన శిక్షలు అమలు చేస్తాం. ఈ చట్టం అమల్లోకి రావడంతో పోటీ పరీక్షలపై విద్యార్థుల్లో విశ్వాసం మరింత పెరుగుతుంది. ప్రతిభ ఆధారంగా అవకాశాలు లభించే వ్యవస్థను బలోపేతం చేయడంలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనాలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటూ పరీక్షా వ్యవస్థను మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉంది’ అని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టబ్‌లో పిల్లలు.. మెడలోతు నీటిలో తండ్రి పోరాటం.. వీడియో వైరల్

అస్సాం వరదలు.. ఆవు దూడ కోసం ప్రాణాలకు తెగించిన వ్యక్తి..

Updated Date - Jul 29 , 2026 | 06:43 PM