ఐపీఎల్2026: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తిలక్!
ABN , Publish Date - Apr 21 , 2026 | 03:30 PM
ముంబై ఇండియన్ స్టార్ ప్లేయర్, హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ అహ్మదాబాద్‌లో సృష్టించిన విధ్వంసం ఇప్పుడు ఐపీఎల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
స్పోర్ట్స్ డెస్క్: ముంబై ఇండియన్ స్టార్ ప్లేయర్, హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ అహ్మదాబాద్‌లో సృష్టించిన విధ్వంసం ఇప్పుడు ఐపీఎల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 45 బంతుల్లోనే అజేయ సెంచరీతో ముంబైకి భారీ విజయాన్ని అందించాడు ఈ తెలుగోడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చేసిన ఓ జోస్యం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతేకాక తిలక్ వర్మ ముంబై కెప్టెన్ అవుతాడా? అనే చర్చకు ఇది మరింత బలాన్ని చేకూర్చింది. మరి.. ఆకాశ్ చోప్రా చెప్పిన జోస్యం ఏమిటి?. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గుజరాత్, ముంబై మ్యాచ్‌లో తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన తర్వాత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా 'ఎక్స్' వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. 'తిలక్ వర్మ త్వరలోనే ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీకి కెప్టెన్ కాబోతున్నాడు. ఆ రోజు కూడా ఎంతో దూరంలో లేదు' అని పేర్కొన్నాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. ' గుజరాత్ టైటాన్స్‌ను తిలక్ వర్మ ఒక్కడే ఓడించాడు. ఒక్క ఇన్నింగ్స్ చూసి కెప్టెన్సీ గురించి ఎలా చెబుతారని మీరు అనుకోవచ్చు. కానీ , రెండేళ్లలో, బహుశా అంతకంటే ముందే తిలక్ వర్మ ఐపీఎల్ ఒక జట్టును నడిపిస్తాడని నేను బలంగా నమ్ముతున్నాను' అని ఆకాశ్ చోప్రా విశ్లేషించాడు.
ఈ మాజీ క్రికెటర్ వ్యాఖ్యలపై నెటిజన్లు పలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మైదానంలో తిలక్ ప్రశాంతత, ఒత్తిడిలో రాణించే తీరు చూస్తుంటే.. భవిష్యత్తులో ముంబై ఇండియన్స్‌కు అతనే కెప్టెన్ అవుతాడని అంటున్నారు. తిలక్ వర్మకు కెప్టెన్సీ బాధ్యతలు కొత్తేమీ కాదు. ఇప్పటికే టీమిండియా 'ఏ' జట్టుకు, ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో భారత్‌కు నాయకత్వం వహించాడు. అంతేకాకుండా దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్ రంజీ జట్టుకు, దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఈ తెలుగు కుర్రాడికి ఉంది.
ఇవి కూడా చదవండి:
సన్ రైజర్స్- ఢిల్లీ మ్యాచ్‌కు వాన గండం.. వెదర్ రిపోర్ట్ ఇదే!
ఐపీఎల్ 2026: ఒకే సెంచరీ.. పలు రికార్డులు బద్దలు
ఐపీఎల్ 2026: తొలి సెంచరీపై తిలక్ వర్మ కీలక వ్యాఖ్యలు