Share News

ఐపీఎల్ 2026: హెడ్-అభిషేక్ శర్మ జోడీ అత్యంత ప్రమాదకరం: ఛతేశ్వర్ పుజారా

ABN , Publish Date - Mar 16 , 2026 | 11:36 AM

ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28న ఆర్సీబీ-ఎస్ఆర్‌హెచ్ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గురించి టీమిండియా మాజీ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్ 2026: హెడ్-అభిషేక్ శర్మ జోడీ అత్యంత ప్రమాదకరం: ఛతేశ్వర్ పుజారా
Chateshwar Pujara

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28న ఆర్సీబీ-ఎస్ఆర్‌హెచ్ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గురించి టీమిండియా మాజీ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో అత్యంత విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టు ఎస్ఆర్‌హెచ్ అని అభిప్రాయపడ్డాడు. ట్రావిస్ హెడ్-అభిషేక్ శర్మ ఓపెనింగ్ జోడీ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమని అన్నాడు.


‘గత రెండు సీజన్లలో ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. తొలి బంతి నుంచే అటాక్ చేయగల సామర్థ్యం వారిద్దరికీ ఉంది. వారి వల్లే జట్టు తరచూ 250కి పైగా స్కోర్లు నమోదు చేస్తోంది. అత్యంత దూకుడైన ఓపెనింగ్ జోడీ ఎవరు అనే ప్రశ్న ఎదురైతే.. చాలా మంది కోహ్లీ-క్రిస్ గేల్ అని అంటారు. కానీ ప్రస్తుతం మాత్రం హెడ్-అభిషేక్ శర్మ జోడీనే మరింత విధ్వంసకరంగా మారింది. బౌలర్లు ఎవరూ అభిషేక్-హెడ్ వంటి ఓపెనర్లకు బౌలింగ్ చేయాలని అనుకోరు’ అని పుజారా అన్నాడు.


అదే ఓ పెద్ద సమస్య

అయితే ఎస్ఆర్‌హెచ్‌కు ఒక ప్రధాన సమస్య ఉందని పుజారా అన్నాడు. హైదరాబాద్‌లో ఆడే మ్యాచ్‌ల్లో జట్టు భారీ స్కోర్లు సాధిస్తుంది కానీ బయట మైదానాల్లో మాత్రం అదే దూకుడు కొనసాగించలేకపోతుందని అన్నాడు. ‘హైదరాబాద్ జట్టు ప్రధానంగా బ్యాటింగ్‌పైనే ఆధారపడుతోంది. ముఖ్యంగా క్లాసెన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వికెట్లు పడిపోయిన తర్వాత జట్టు పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతోంది. ఇదే విషయం ప్రత్యర్థి జట్లు ఉపయోగించుకుంటున్నాయి. బౌలింగ్ విషయంలోనూ ఎస్ఆర్‌హెచ్ కాస్త మెరుగవ్వాలి’ అని పుజారా పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

బాబర్ ఆజమ్ మానసిక స్థితి సరిగ్గా లేదు: పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

చరిత్రను మార్చాలని చూడొద్దు.. బీసీసీఐపై రోహిత్ శర్మ అభిమానుల ఆగ్రహం

Updated Date - Mar 16 , 2026 | 11:37 AM