Share News

పాకిస్థాన్ ఎలాగూ గెలవదు.. ఇక ఐసీసీ ట్రోఫీలను దొంగలిస్తారేమో!: కమ్రాన్ అక్మల్

ABN , Publish Date - Mar 16 , 2026 | 10:32 AM

బంగ్లాదేశ్‌తో పాక్ మూడు వన్డేల సిరీస్ ఆడింది. ఆఖరి మ్యాచ్‌లో 11 పరుగులతో ఓడి 2-1 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. దీంతో పాక్ జట్టు మరోసారి విమర్శలపాలైంది. బంగ్లాపై ఓటమి నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

పాకిస్థాన్ ఎలాగూ గెలవదు.. ఇక ఐసీసీ ట్రోఫీలను దొంగలిస్తారేమో!: కమ్రాన్ అక్మల్
Kamran Akmal

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ జట్టు గత కొంతకాలంగా విమర్శలు ఎదుర్కొంటూ వస్తోంది. టీ20 ప్రపంచ కప్ టోర్నీలోనూ విఫలయత్నాలు చేసి సూపర్ 8 దశలోనే నిష్క్రమించింది. తాజాగా బంగ్లాదేశ్‌తో పాక్ మూడు వన్డేల సిరీస్ ఆడింది. ఆఖరి మ్యాచ్‌లో 11 పరుగులతో ఓడి 2-1 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. దీంతో పాక్ జట్టు మరోసారి విమర్శలపాలైంది. బంగ్లాపై ఓటమి నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీపై విమర్శలు గుప్పించాడు.


‘ఇప్పుడున్న పరిస్థితుల్లో నెదర్లాండ్స్ వంటి జట్లు కూడా పాకిస్థాన్‌తో సిరీస్ ఆడాలని కోరుకుంటాయి. పాక్‌ను ఓడించి టెస్ట్ హోదా పొందాలని ఆశిస్తాయి. వాళ్లను అసలు తప్పుపట్టడానికి లేదు. పాకిస్థాన్ క్రికెట్ పరిస్థితే దారుణంగా మారింది. ఇప్పుడు మీరు ఎలాగూ మ్యాచ్‌ల్లో గెలవరు.. మరి ఐసీసీ ట్రోఫీలు దొంగలించి తీసుకువస్తారా?’ అని నఖ్వీపై కమ్రాన్ పరోక్షంగా విమర్శలు చేశాడు.


తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది. తంజీద్ హసన్ తమీమ్(107) సెంచరీతో చెలరేగాడు. లక్ష్యఛేదనకు దిగిన పాక్.. 279 పరుగులకే కుప్పకూలింది. సీనియర్ బ్యాటర్ సల్మాన్ అలీ అఘా(106) సెంచరీ చేసినా.. జట్టును గెలిపించలేకపోయాడు. ఆఖర్లో కెప్టెన్ అఫ్రిది(37) రెండు భారీ సిక్సర్లు బాది జట్టును విజయ పథం వైపు నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ తర్వాతి బంతికే అఫ్రిది స్టంపౌట్ అవ్వడంతో బంగ్లా విజయం లాంఛనమైంది. 11 పరుగుల తేడాతో ఓడిన పాక్.. 1-2తో సిరీస్‌ను కోల్పోయింది.


ఇవి కూడా చదవండి:

బాబర్ ఆజమ్ మానసిక స్థితి సరిగ్గా లేదు: పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

చరిత్రను మార్చాలని చూడొద్దు.. బీసీసీఐపై రోహిత్ శర్మ అభిమానుల ఆగ్రహం

Updated Date - Mar 16 , 2026 | 10:32 AM