కెప్టెన్‌గా ఉన్నప్పుడు రిలాక్స్ అవ్వొద్దు.. అక్షర్ పటేల్‌కు పుజారా సూచన
ABN , Publish Date - Mar 19 , 2026 | 08:27 AM
గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆరంభంలో వరుసగా నాలుగు మ్యాచుల్లో అదరగొట్టి.. ఆ తర్వాత పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌కు కూడా చేరని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీసీ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు టీమిండియా మాజీ ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా కీలక సూచనలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28న ఆర్సీబీ-ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆరంభంలో వరుసగా నాలుగు మ్యాచుల్లో అదరగొట్టి.. ఆ తర్వాత పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌కు కూడా చేరని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీసీ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు టీమిండియా మాజీ ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా కీలక సూచనలు చేశాడు. జట్టుకు సారథిగా ఉన్న సమయంలో ఎప్పుడూ రిలాక్స్ అవ్వొద్దని చెప్పాడు.
‘అక్షర్ పటేల్ చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఎక్కువ ఒత్తిడిని తీసుకోడు. అతడి వ్యక్తిత్వం మంచిది. అయితే ఐపీఎల్‌లో తీవ్ర ఒత్తిడి ఉంటుందని అందరికీ తెలుసు. ప్లేయర్లకు నిరంతరం మద్దతుగా నిలవాలి. అదే సమయంలో అక్షర్ పటేల్ ఢిల్లీ జట్టుకు కెప్టెన్.. సారథిగా ఉన్నప్పుడు ఎప్పుడూ రిలాక్స్‌గా ఉండకూడదు. విజయాలతో వచ్చే జోష్‌ను కొనసాగించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఒక్కసారి వదిలేస్తే మళ్లీ కోలుకోవడం చాలా కష్టం. గతేడాది కూడా ఢిల్లీకి ఇలాంటి అనుభవమే ఎదురైంది. అందుకే ఈ సీజన్‌లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని పుజారా వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: సీఎస్కే వైస్ కెప్టెన్‌గా సంజు శాంసన్.. టీమిండియా దిగ్గజం ఏమన్నాడంటే!
విరాట్ కోహ్లీ ఆర్సీబీకి గుండెలాంటోడు: ఏబీ డివిలియర్స్