Share News

మళ్లీ పాకిస్థాన్ టెస్టు జట్టు కెప్టెన్‌గా బాబర్ ఆజం..

ABN , Publish Date - Jul 05 , 2026 | 02:22 PM

పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం మళ్లీ టెస్టు జట్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.

మళ్లీ పాకిస్థాన్ టెస్టు జట్టు కెప్టెన్‌గా బాబర్ ఆజం..
Babar Azam

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం మళ్లీ టెస్టు జట్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఇప్పటివరకు ఆ బాధ్యతలు నిర్వహించిన షాన్ మసూద్‌ను తప్పిస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పట్టికలో మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ తొమ్మిదో స్థానంలో ఉంది. ఈ నిర్ణయంతో పాటు జట్టులో భారీ ఎత్తున మార్పులు చోటు చేసుకున్నాయి. వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్.. ఇంగ్లండ్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం కొత్తగా నలుగురు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లకు అవకాశం కల్పించారు.


బాబర్ ఆజం నాయకత్వంలో పాకిస్థాన్ టెస్ట్ జట్టు కొత్త ఆరంభాన్ని ఆశిస్తోంది. గతంలో షాన్ మసూద్ కెప్టెన్సీలో జట్టు ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచింది. 16 టెస్టుల్లో 12 పరాజయాలు ఎదుర్కొని విమర్శలకు గురైంది. అలాగే వరుసగా ఏడు టెస్టుల్లో ఓడిపోయి చెత్త రికార్డును మూటగట్టుకుంది. ముఖ్యంగా ఇటీవల బంగ్లాదేశ్ చేతిలో స్వదేశంలోనే టెస్టు సిరీస్‌ను కోల్పోవడంతో మసూద్ కెప్టెన్సీ ప్రమాదంలో పడింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పర్యటనల్లో కూడా వరుసగా సిరీస్‌లను క్లీన్‌స్వీప్‌గా కోల్పోయింది. ఈ క్రమంలో మసూద్‌ను తప్పించి తిరిగి బాబర్‌కే పీసీబీ అవకాశం కల్పించింది. అయితే ఇటీవల టెస్టుల్లో బాబర్ ఫామ్ ఆశించిన స్థాయిలో లేదు. అయినప్పటికీ అతడినే కెప్టెన్‌గా నియమించడం గమనార్హం.


ఇవి కూడా చదవండి:

మహిళల టీ20 ప్రపంచ కప్: స్మృతి మంధానకు ప్రత్యేక గుర్తింపు

సచిన్ నుంచి వైభవ్ వరకు.. 37 ఏళ్లలో ఎంత మార్పు!

Updated Date - Jul 05 , 2026 | 02:22 PM