కౌంటీ ఛాంపియన్‌షిప్: ఆకిబ్ నబీకి సర్‌ప్రైజ్ ఛాన్స్.. సర్రే జట్టు తరఫున..
ABN , Publish Date - Aug 31 , 2026 | 07:29 AM
జమ్మూ కశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ క్రికెట్ ప్రయాణం అద్భుతంగా కొనసాగుతోంది. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లోని డివిజన్-1లో సర్రే జట్టు తరఫున ఆడే అవకాశం లభించింది.
ఇంటర్నెట్ డెస్క్: జమ్మూ కశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ క్రికెట్ ప్రయాణం అద్భుతంగా కొనసాగుతోంది. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లోని డివిజన్-1లో సర్రే జట్టు తరఫున ఆడే అవకాశం లభించింది. వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌ల్లో నబీ బరిలోకి దిగనున్నాడు. నవంబర్‌లో న్యూజిలాండ్ పర్యటనలో భారత్ ఆడనున్న రెండు టెస్టులను దృష్టిలో పెట్టుకుని నబీని కౌంటీలకు పంపాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
న్యూజిలాండ్‌తో టెస్టులకు ముందు నబీ సర్రే తరఫున మూడు కౌంటీ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. అవసరమైన వర్క్ వీసా అనుమతులన్నీ పూర్తి కావడంతో అందుబాటులో ఉన్న తొలి విమానంలో అతడు ఇంగ్లండ్‌కు బయల్దేరాడు. బుధవారం ది ఓవల్‌లో యార్క్‌షైర్‌తో జరిగే మ్యాచ్‌లో సర్రే తరఫున నబీ అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
భారత్ తరఫున కూడా అవకాశం..
శ్రీలంకతో జరిగిన రెండు టెస్టులకు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో నబీని భారత జట్టులోకి ఎంపిక చేశారు. అయితే తుది జట్టులో ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కడంతో నబీకి మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. న్యూజిలాండ్‌లోని పరిస్థితులు ఇంగ్లండ్ వాతావరణంతో సారూప్యత కలిగి ఉండటంతో.. అక్కడి కౌంటీ మ్యాచ్‌ల ద్వారా నబీకి మంచి మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తుందని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. సెప్టెంబర్ 22 నుంచి ఆస్ట్రేలియా ‘ఎ’తో భారత్ ‘ఎ’ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌ల సమయానికి నబీ భారత్‌కు తిరిగి వచ్చే అవకాశముంది. మరోవైపు అక్టోబర్ 1 నుంచి 5 వరకు శ్రీనగర్‌లో ఇరానీ కప్ జరగనుంది. ఇందులో రంజీ ట్రోఫీ విజేత జమ్మూ కశ్మీర్, రెస్ట్ ఆఫ్ ఇండియా తలపడనున్నాయి.
ఇవి కూడా చదవండి:
సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో టీమిండియా దిగ్గజం
కెప్టెన్‌గా తొలి డీఆర్ఎస్ తీసుకున్న వైభవ్ సూర్యవంశీ..