బోణీ అదిరేలా..
ABN , Publish Date - Aug 31 , 2026 | 03:53 AM
మహిళల టీ20 ఆసియాక్‌పలో భారత జట్టు ఘనంగా బోణీ చేసింది. బ్యాటింగ్‌లో కాస్త తడబడినా.. బౌలర్లు మాత్రం అంచనాకు తగ్గట్టు రాణించారు. దీంతో ఆదివారం గ్రూప్ ‘ఎ’లో భాగంగా...
థాయ్‌పై 94 రన్స్ తేడాతో ఘనవిజయం
షఫాలీ వర్మ హాఫ్ సెంచరీ
దీప్తి, నందనిలకు మూడేసి వికెట్లు జూమహిళల టీ20 ఆసియాకప్
దుబాయ్: మహిళల టీ20 ఆసియాక్‌పలో భారత జట్టు ఘనంగా బోణీ చేసింది. బ్యాటింగ్‌లో కాస్త తడబడినా.. బౌలర్లు మాత్రం అంచనాకు తగ్గట్టు రాణించారు. దీంతో ఆదివారం గ్రూప్ ‘ఎ’లో భాగంగా థాయ్‌లాండ్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన 94 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (36 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 64) మాత్రమే అర్ధసెంచరీతో ఆకట్టుకుంది. స్పిన్నర్లు సలీపోర్న్‌కు మూడు, సునిదకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో థాయ్‌లాండ్ దారుణంగా విఫలమైంది. నన్నపట్ (41) మినహా ఎవరూ రెండంకెల స్కోర్లు కూడా సాధించలేదు. దీంతో థాయ్ 16.1 ఓవర్లలో 65 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్ దీప్తి ఏడు బంతుల్లో ఒక్క పరుగివ్వకుండానే మూడు వికె ట్లు తీసింది. నందనికి మూడు, శ్రీచరణికి రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా షఫాలీ నిలిచింది. ప్రతీకా రావల్ ఈ మ్యాచ్ ద్వారా పొట్టి ఫార్మాట్‌లో అరంగేట్రం చేసింది.
అటు షఫాలీ.. ఇటు బౌలర్లు: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో భారీ స్కోరు ఖాయమనిపించింది. తమకన్నా బలహీనమైన థాయ్‌లాండ్ బౌలర్లను చెడుగుడు ఆడేస్తారనిపించింది. కానీ థాయ్ బౌలర్లు అబ్బురపరిచారు. వీరి ధాటికి భారత మిడిలార్డర్ ఎప్పటిలాగే చేతులెత్తేసింది. తొలి పది ఓవర్లలో 101/2 స్కోరుతో ఉండగా భారత్ సులువుగా 200 రన్స్ చేస్తుందనిపించింది. కానీ కేవలం 29 పరుగుల తేడాతో ఏకంగా 7 వికెట్లు కోల్పోయి డీలా పడింది. ఓపెనర్ షఫాలీ మాత్రమే దీటుగా ఆడగలిగింది. చివర్లో క్రాంతి బ్యాటింగ్ కారణంగా కష్టమ్మీద స్కోరు 150 దాటింది. అయితే తొలి ఓవర్‌లో ఓపెనర్ మంధాన మూడు ఫోర్లతో ఇన్నింగ్స్‌ను ధాటిగానే ఆరంభించింది. కానీ మూడో ఓవర్‌లో తను రనౌట్ కావడంతో షఫాలీ బాధ్యత తీసుకుంది. ఎడాపెడా బౌండరీలు బాదేయడంతో పవర్‌ప్లేలో జట్టు 65/1తో నిలిచింది. అదే జోరుతో ఓ సిక్సర్‌తో 26 బంతుల్లోనే ఫిఫ్టీని పూర్తి చేసింది. ప్రతీకా ఫర్వాలేదనిపిస్తూ రెండో వికెట్‌కు 53 పరుగులు జోడించాక తొమ్మి దో ఓవర్‌లో వెనుదిరిగింది. ఇక ఆ తర్వాత థాయ్‌లాండ్ స్పిన్నర్ల హవా ఆరంభమైంది. 13వ ఓవర్‌లో షఫాలీ, రిచా (0)లను సలీపోర్న్ వెనక్కి పంపింది. దీప్తి (5) రనౌట్ కాగా.. సునిద కూడా 17వ ఓవర్‌లో మరో రెండు వికెట్లను తీసింది. 137/9 స్కోరుతో కష్టాల్లో పడిన జట్టు పూర్తి ఓవర్లు ఆడడం కూడా కష్టమే అనిపించినా.. ఆఖరి వికెట్‌కు క్రాంతి (15 నాటౌట్), శ్రీచరణి (6 నాటౌట్) జోడీ 22 పరుగులు అందించి పరువు కాపాడింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 20 ఓవర్లలో 159/9. (షఫాలీ వర్మ 64, ప్రతీకా 22, మంధాన 19; సలీపోర్న్ 3/26, సునిద 2/31). థాయ్‌లాండ్: 16.1 ఓవర్లలో 65 ఆలౌట్ (నన్నపట్ 41; దీప్తి శర్మ 3/0, నందని 3/18).
1
మహిళల టీ20ల్లో ఎక్కువ వికెట్లు (171) తీసిన బౌలర్‌గా దీప్తి శర్మ
2
మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు (10,756) చేసిన రెండో బ్యాటర్‌గా స్మృతి మంధాన. మిథాలీ (10868) టాప్‌లో ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
ప్లాస్టిక్ భూతం మధ్యన బోసిపోయిన రావిచెట్టు
‘టాక్సిక్’లో అసభ్యత తప్ప సమాజానికి ఉపయోగపడే సందేశం లేదు: రాజా